కాళికాదేవి పాలించే కలకత్తాలో పాశవికమైన మానభంగం-హత్య జరిగాయి. దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి. బాధితురాలు మెడికొ కావడంతో ఆగష్ట్ 17 న దేశవ్యాప్తంగా హాస్పిటల్స్ అన్నీ మూతపడ్డాయి. ఎమెర్జెన్సీ, సీరియస్ సర్వీసులు తప్ప సాధారణ ప్రజలకి వైద్యసేవలు అందలేదు.
అసలీ రేపులేవిటి? నిర్భయ, దిశ సంఘటనలు జరిగినా మృగాళ్లకి బుద్ధి రాదా అని అనుకుంటున్నవారు ఎందరో!
ఒక మగాడికి రేప్ చేసేందుకు ఉసిగొల్పే వాటిల్లో ప్రధానమైనది మానసిక దౌర్బల్యం. మనసు మీద కంట్రోల్ లేకపోవడం, మహిళని భోగవస్తువులా చూడడం ఈ రెండూ మానసిక దౌర్బల్యాలే. సంఘనీతి, పాపభీతి, దైవ ప్రీతి, చట్టమంటే భయం, చేస్తున్నది తప్పు అనే ఇంగితం మనుషుల్ని నియంత్రణలో పెడతాయి. కొందరికి నియంత్రణ పూర్తిగా లెకపోయినా బలవంతంగా అణచుకుంటారు. కానీ మద్యం, డ్రగ్స్ వంటివి సీన్లోకొస్తే అణచుకున్న ఆ బలహీనతలన్నీ బయటికొస్తాయి. అప్పుడు అణచుకున్నవాళ్లు రేపులు చేయడానికి ఆస్కారం ఎక్కువవుతుంది.
రేప్ అనేది కొత్తదేమీ కాదు. ఇది ఆధునిక పోకడలవల్ల చోటు చేసుకున్నదీ కాదు. శతాబ్దాల నుంచీ ఉన్నదే ఇది. మగాడికి స్త్రీపట్ల ఉన్న ఆధిపత్య ధోరణి, స్త్రీని బలాత్కరించడం తన పురుషాహంకార ప్రదర్శనలో భాగం అనుకోవడం మానభంగానికి దారితీస్తాయి.
మన దేశంలో ఏటా సుమారు 30,000 రేప్ కేసులు నమోదవుతున్నాయని ఒక అంచనా. పోలీస్ స్టేషన్ దాకా రానివి ఇంకెన్నో. అయితే ఈ రుగ్మత మన దేశంలోనేనా? అంటే కాదు. పూర్తి సురక్షిత దేశాలుగా ర్యాంకింగ్ సాధించిన డెన్మార్క్, స్విట్జర్ల్యాండ్ వంటి దేశాల్లో కూడా 2000 కి అటు ఇటుగా ప్రతి ఏటా రేప్ కేసులు నమోదవుతుంటాయి. అక్కడి జనాభా నిష్పత్తిలో చూస్తే అది పెద్ద నంబరే.
ఇక సింగపూర్ లాంటి దేశాన్ని తీసుకుందాం. అక్కడ జనాభా మొత్తం 59 లక్షలు. అక్కడ కూడా 2023లో 354 కేసులు నమోదయ్యాయి. అంటే అదీ ఎక్కువనే చెప్పాలి. అమెరికాలో 2023 లో 1,18,570 రేప్ కేసులు నమోదయ్యాయి. ఇది ఇండియాకంటే ఎక్కువ. చైనాలో అయితే ఈ లెక్క 13,710.
కొన్ని రాచరిక దేశాలు లెక్కలు బయటపెట్టవు. అలాగని అక్కడ జరగవని కాదు. దేశం పరువు పోకుండా కాపాడుకునేందుకు వాళ్లు అక్కడి మీడియాని కూడా తమ కంట్రోల్లో పెట్టుకుంటారు. నేరాల విషయాలు ప్రపంచానికి వినిపించేలా మీడియాని చెప్పనీయరు.
కనుక ఇదేదో మన దేశంలోనే ఉంది అని కాదు. అన్ని దేశాల్లోనూ ఉంది. అభివృద్ధి చెందిన, చెందని, చెందుతున్న.. అన్న తేడా లేకుండా సర్వత్రా వ్యాపించి ఉంది.
అయితే సమాజం కేవలం “రేప్” ని పెద్దదిగా చూడడంలేదు. రేప్ చేసి తర్వాత మర్డర్ కూడా జరిగినప్పుడే అది జాతీయ వార్త అవుతోంది. నిర్భయ కేసైనా, దిశ అయినా, ఇప్పుడు కలకత్తాలోని మెడికో మృతి అయినా అక్కడున్నది రేప్ అండ్ మర్డర్ కేస్.
మనిషి మరణిస్తే తప్ప మన సమాజంలో కోపం రాదు. అది కూడా ఎంత దారుణంగా హింసంచబడి చనిపోతే అంత ఎమోషన్ చూపిస్తారు. చనిపోయిన వ్యక్తి డాక్టరైతే డాక్టర్లు స్ట్రైక్ చేయడం, విద్యార్థిని అయితే విద్యార్థి వర్గాలు నిరసన చేయడం, మరొకరైతే ఆ వర్గం గొడవ చేయడం చూస్తాం తప్ప సంఘటితంగా మహిళకి జరిగిన అన్యాయం అని అందరూ స్పందించరు. అంతే కాదు, అలా రేప్ కి గురై చనిపోయిన మహిళ పెద్దగా విద్యార్హత లేని దారిద్రరేఖకి అటు ఇటుగా జీవిస్తున్న నిమ్నకులస్తురాలైతే సమాజం పట్టించుకోదు. మిజోరాం అల్లర్లలో వీడియో బయటికొచ్చినట్టు వస్తే తప్ప అది పెద్ద వార్త అవ్వదు. ఇది మన సమాజంలో ఉన్న లోపం.
ఈ ఆందోళనలు, నిరసనలు కూడా మరో పెద్ద వార్తేదో వచ్చేవరకే. నిరసనకారుల డిమాండ్ కూడా నేరస్థుడిని తక్షణం శిక్షించి చనిపోయిన మహిళకి న్యాయం చేయమనే. వాడు శిక్షింపబడినా, ఎన్ కౌంటర్లో చనిపోయినా సినిమాలో క్లైమాక్స్ అయిపోయాక లేచి వెళ్లిపోయినట్టు వెళ్లిపోతారు.
ఇక్కడ శాశ్వత పరిష్కారమో, కాస్తంత మెరుగైన ప్రయత్నమో ఆలోచించాలి.
ప్రపంచవ్యాప్తంగా సైకియాట్రిస్టుల నుంచి సోషల్ కౌన్సిలర్ల వరకు చెప్పేది నిత్యం మగపిల్లలకి స్త్రీలపట్ల ఎలా బిహేవ్ చేయాలి అన్నదానిపై అవగాహన పెంచడం, డ్రగ్స్ – మద్యం వంటి వాటి నుంచి వారిని దూరంగా ఉంచడం ప్రధానంగా చేయగలిగే మానవప్రయత్నాలు.
సినిమా హాళ్లల్లో “మద్యం-పొగతాగడం ఆరోగ్యానికి హానికరం” అని చెప్పినట్టుగా స్త్రీలని చూసే విధానం పట్ల కూడా ప్రకటనలు రావాలని కోరుతున్నవారున్నారు.
ఇవన్నీ చేస్తే ఇక రేపులు ఆగిపోతాయా అని అడగొచ్చు. ఆగకపోయినా మరింత పెరగకుండా ఉంటాయి. అరబ్ దేశాల్లో మద్యం అంత విచ్చలవిడిగా దొరకదు. ఖరీదైన స్టార్ హోటల్స్ లో అత్యధిక ధరలకి తప్ప సామాన్యంగా సగటు మనిషి ఇండియాలోలాగ కోరుకున్నంత చీప్ లిక్కర్ తాగేసే వీలు లేదక్కడ. అలాంటి కట్టడి చేయగలిగే వ్యవస్థ మన దేశంలో కూడా రావాలి. ఎందుకంటే ఢిలీల్లో నిర్భయ కేసు విషయంలోనూ, దిశ విషయంలోనూ మద్యం ప్రధానపాత్ర పోషించింది.
అలాగే అడుగడుగున ఒక్క ఇంచ్ కూడా వదలకుండా సీసీ కెమెరా వ్యవస్థ ఉండాలి. నేరం జరిగాక ఎలా జరిగిందో తెలుసుకోవడానికి మాత్రమే కాకుండా నిత్యం మానిటరింగ్ చేసే వ్యవస్థ కూడా పెంచాలి.
ఉదాహరణకి ఒక ప్రాంతంలో సీసీ కెమెరాలు పెట్టి వాటి మానీటరింగ్ గృహిణులకి, నిరుద్యోగ యువతికి అప్పజెప్పి వాలంటీర్లకు ఇచ్చినట్టు చిన్నపాటి వేతనాలివ్వచ్చు. ఎక్కడ ఏ సమస్యని చూసినా వెంటనే వాళ్లు స్థానికి పోలీసుల్ని అలర్ట్ చేయొచ్చు. ఇలా కాలేజీల్లోనూ, హాస్పిటల్స్ లోనూ, వీధుల్లోనూ..అన్ని చోట్ల నిఘా వ్యవస్థ పెంచాలి.
ఇంతమంది జనాభా ఉన్న దేశంలో నిఘా వ్యవస్థకి కావాల్సినంత మంది జనం దొరుకుతారు. దానిని పటిష్టపరిచే ఆలోచనలు చేయాలి. దీనికి స్వచ్ఛంద సంస్థలు, సీఎస్సార్ ఇనీషియేటివ్ గా కొన్ని కంపెనీలు కూడా పూనుకోవచ్చు. ఒక్క రేపులనే కాదు.. అన్ని రకాల నేరాలు వెంటనే అరికట్టే విధంగా నిఘా వ్యవస్థ ఉంటే దేశం యొక్క సేఫ్టీ ఇండెక్స్ పెరుగుతుంది. అది మనకే మంచిది.
దీంతో పాటూ శిక్షలు మరింత కఠినతరం కావాలి. ఇండియాలో రేప్ కేస్ విషయంలో ప్రాధమిక నిర్ధారణ జరిగి నేరస్థుడు ఫలానా అని తేలాక, జాప్యం లేకుండా “తక్షణ ఉరి” అనే చట్టం కూడా ఉండాలి. ఇందాక చెప్పుకున్న నిఘా వ్యవస్థ బలంగా ఉంటే ఆ నిర్ధారణ కూడా తేలికవుతుంది.
ఇవన్నీ చేయకుండా కేవలం తాత్కాలిక ఎమోషన్ ని ప్రదర్శించడం వల్ల దేశం పరువు పోవడం, మహిళలు మరింత భయభ్రాంతులకి గురవడం తప్ప ప్రయోజనమేమీ ఉండదు. అలాగని ఈ ఎమోషన్ ఉండకూడదని కాదు. “తాత్కాలికం”గా కాకుండా ఎప్పటికీ ఉండాలి.
– పద్మజ అవిర్నేని
“ఎక్స్ప్రెస్ రైళ్లలో జనరల్ బోగీల సంఖ్య తగ్గింపు…అన్ని ప్రధాన రైళ్లలో రెండు కోచ్లకే పరిమితం. బోగీలు కిక్కిరిసిపోవడంతో శ్రామిక శక్తి కొరతను తీరుస్తున్న పేదలు టాయిలెట్లలోనూ నిలబడి ప్రయాణిస్తున్నారు. మరుగుదొడ్డిలోనే అల్పాహారం తింటున్నారు.”
ఏ British కాలంలోనే, Congress కాలంలోనే వేసిన railway lines తప్ప, కొత్తగా ఒక్క line వేయలేని చాయ్ వాలా ప్రభుత్వం vande express, bullet train అంటూ పన్నులు కట్టే మధ్యతరగతికి ఏదో మేలు చేస్తున్నామన్న భ్రమలు కల్పిస్తూ, పేదలను నిర్దాక్షిణ్యంగా తొక్కేస్తుంది.
ఆ బడాబాబుల రైలు కూడా ప్రైవేట్ పరం చేస్తాడు…రైల్వే భూములు హాంఫట్…ఆ యన్ని ఇంద్రుడు చంద్రుడు అని మన “బి” కాస్ట్ ఒకపక్క..అదానీ అంబానీ నడిపే పెయిడ్ మీడియా సోషల్ మీడియా మరోపక్ ఎతుతునే ఉంటుంది
“అరబ్ దేశాల్లో మద్యం అంత విచ్చలవిడిగా దొరకదు. ఖరీదైన స్టార్ హోటల్స్ లో అత్యధిక ధరలకి తప్ప సామాన్యంగా సగటు మనిషి ఇండియాలోలాగ కోరుకున్నంత చీప్ లిక్కర్ తాగేసే వీలు లేదక్కడ.”
జగనన్న లాగా ఒళ్ళు కదల్చకుండా 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగిరీ వెలగబెట్టే పరిస్థితి పేదలకు లేనప్పుడు, రోజంతా వొళ్ళు హూనమయ్యేలా కష్టించి రాత్రికి వొళ్ళు నొప్పులతో నిద్ర లేకుండా కూర్చొని, తర్వాతి రోజు కూలికి వెళ్లకుంటే కుటుంబాలు గడవవుగా మరి.
What good has Jagan’s Disa act done to the society? Why no other state adapted that? Or even no state has implemented the welfare schemes with the help or volunteers. Aren’t people getting welfare in those states? Padamaja wants government to literally throw away millions of volunteer jobs.
Andhra ammaai rape n muder ite adige nathude ledu
by hanging them
కోల్కత్త లో ఓ డాక్టరమ్మ కు దారుణమైన అన్యాయం జరిగింది, మన రాష్ట్రం లోనే మరొక డాక్టరమ్మ తన తండ్రి కిరాతకంగా చంపబడ్డా, ఐయిదు ఏళ్ళైనా ఇంకా న్యాయం జరగలేదు. రెండిటికి పోలిక మాఫియా టైపు రాజకీయమే. అయ్యో పాపం అని ఇంకో రాష్ట్రం లో డాక్టరమ్మ కు జరిగిన అన్యాయం పై వ్యాసాలు రాసే పత్రికలు, అవే మన రాష్ట్రం డాక్టరమ్మ కు జరుగుతున్న అన్యాయం మటుకు హేళనగా రాస్తున్నాయి. మహిళలు ఎవరైనా మహిళలే, వారిని కాపాడటం మన ధర్మం. కానీ ఈ తేడాలు ఎందుకంటావ్ గ్రేట్ ఆంధ్రా?
ఆకలిని.. దాహాన్ని.. కామాన్ని.. ఇలా ప్రకృతి పరమైన కోరికలని ఎవరు అరికట్టలేరు.. కాకపోతే వాటిని రెచ్చగొట్టి ప్రేరేపించే వాటిని తప్పకుండా అరికట్టవచ్చు.. కానీ మన లాంటి బీద బిక్కు నిరుపేద దేశం లో ప్రభుత్వానికి అప్పుడు డబ్బు రాదు.. మద్యం ఒక్కటి అరికడితే తొంబై శాతం అరాచకాలు ఆగుతాయి…
Catch22.
మద్యం ఆపితే ప్రభుత్వా నికి డబ్బు రాదు.
మద్యం వుంచేతే ప్రజలకి ఆపదలు తప్పవు.
పచ్చి నిజం.
మన దేశంలో ప్రతి ఒక్కళ్ళు స్మార్ట్ లో దుస్తులు ధరించాలి వాటికి ప్రత్యేక సీక్రెట్ కోడ్ వారికి మాత్రమే ఓపెన్ అయ్యేలా పెడితే ఒక్క సంఘటన కూడా జరగదు , ఫోన్ లాక్ కోడ్ లాగ
😂
Sarvamoo aadhaar ki link chese vallu mandu kuda link chesi within limit matrame ammite ee incidents taggutayemo alochinchali
పాత సినిమాలో భానుమతి పడిన ఒక పాట ఉంటుంది, “ఓ బాటసారి నను మరువకోయి” అని . లిటరసీ రేట్ పెంచడం, నిరుద్యోగ శాతం తగ్గించడం, కుటుంబాలని ప్రోత్సహించడం, వ్యభిచారం లీగలైజ్ చెయ్యడం లాంటివి ఇవి తగ్గడానికి దోహదం చేస్తాయి.
కామ కొరికని రెచ్చగొట్టడం వలన ఇది జరుగుతుంది.. మద్యం మత్తు తెలియక రెచ్చగొడుతుంది.. చలన చిత్రం తెలిసి రెచ్చగొడుతుంది.. చలన చిత్రం వలన సమాజానికి అష్ట దరిద్రాలు చుట్టుకున్నాయి..
100 నెంబర్ ఉంది . సంఘటన జరిగే ప్రదేశం నుంచి కాల్ చేస్తే వస్తారో , రారో తెలియదు. ఉదాహరణ ఏలూరులో మొన్న జరిగిన సంఘటన. పెట్రోలింగ్ వెహికల్ పోలీసులకి పొద్దున్నో , అర్ధరాత్రో పెసరట్లు తెచుకోవడానికో , ఇంకా పెద్దవారి భోగానికో అంతే. ఇంకా కెమెరాలు , మానిటరింగ్ అని taxpayers మనీ భోంచెయ్యమని సలహా. Do you know estimated time to reach a spot with this vehicle? You don’t, I bet. Panic button on disha app.
100 నెంబర్ ఉంది . సంఘటన జరిగే ప్రదేశం నుంచి కాల్ చేస్తే వస్తారో , రారో తెలియదు. ఉదాహరణ ఏలూరులో మొన్న జరిగిన సంఘటన. పెట్రోలింగ్ వెహికల్ పోలీసులకి పొద్దున్నో , అర్ధరాత్రో పెసరట్లు తెచుకోవడానికో , ఇంకా పెద్దవారి భోగానికో అంతే. ఇంకా కెమెరాలు , మానిటరింగ్ అని taxpayers మనీ భోంచెయ్యమని సలహా.
Estimated time to arrive is less than 15mins. Check dpr. Panic button on disha app. Still camera, monitoring taxpayers money going to drain
మన కి వున్న అధిక జనాభా కి పిలవగానే రావాలి అనే వ్యవస్థ రావాలి అంటే , పోలీసు లా సంఖ్య పెరగాలి.
అలా పెరిగిత్, అమెరికా లో లాగ మరల పోలీస్ స్టేట్ అవుతుంది దేశం. వున్న స్వేచ్చ కూడా పోలిసు చేతుల్లో కి వెళ్ళిపోతుంది.
కా మ కొరికని రెచ్చగొట్టడం వలన ఇది జరుగుతుంది.. మద్యం మ త్తు తెలియక రెచ్చగొడుతుంది.. చలన చిత్రం తెలిసి రెచ్చగొడుతుంది.. చలన చిత్రం వలన సమాజానికి అష్టదరిద్రాలు చుట్టుకున్నాయి..
మన దేశంలో కుహనా రాజకీయాలు వున్నంతవరకు , డబ్బు, ఎవరినైనా ,వయసుతో సంబంధం లేకుండా ఇష్టంవచ్చినట్టు బలాత్కారం చేసి ఖండఖండాలుగా ముక్కలు చేసి చంపేసి అందరినీ వెక్కిరిస్తుంది.
Brutal rapes and murders enduku chestaru.. Psychopaths a ala alochistara…normal male species ala undavu kada..There is something wrong with man kind… Adavallemi Takkuva kadu kada.. intro mogullani purugula kante heenam ga chuse adavaallu naku telusu…so magavaalle durmargulu ani anadaniki ledu..But ila chesevallaki bahiranga uri or food & water ivvakunda chanipoyevaraku kattesi unchali..
Call boy jobs available 8341510897
Vc available 9380537747
కొందరు వొళ్ళు బలిసి నా వొళ్ళు నా ఇష్టము అని ఎక్సపోజింగ్ చేస్తూ ఉంటారు
అలాంటివి చూసి చూసి
కొంత మంది వారికి అందుబాటులో వున్న నిర్బలుల మీదకి వెళ్లి అత్యాచారాలు చేస్తున్నారు ఇలాంటి వాళ్ళని అతి క్రూరంగా త్వరగా శిక్షిస్తే ఇంకొక్కడి కి దైర్యం ఉండదు
అలాంటివి చూసి చూసి
సామాన్యులకి ఇంతకు ముందు 90″s లో స్పందనులు ఊరికినే వచ్చేయి ఇప్పుడు మొత్తము విప్పి నుంచున్నా స్పందన రావటము లేదు.
వైఎస్ఆర్ పార్టీ నుండి ఈ హత్యాచారం నీ ఖండిస్తూ ఒక్క అధికార ప్రకటన కూడా రాలేదు ఏమిటి?
మమత అక్క కి కోపం వస్తది ఏమో అని జగన్ భయపడ్డాడ ?
ఆడపిల్ల ల తల్లి తండ్రులు ,
తమ కూతురు ఇంటికి క్షేమంగా తిరిగి వచ్చేదాక భయంతో అల్లల్లడుతున్నారు ప్రతి రోజూ.
అవతలి వాళ్ళ మనసుల్లో యే చెడ్డ ఆలోచన వుందో తెలియదు కాబట్టి, వీలు అయినంత వరకు మరీ క్లోజ్ కాకుండా, ఎవరి జాగ్రత్త లో వాళ్ళు వుండటమే క్షేమం.
ప్యాలస్ పులకేశి డబ్బు కోసం ప్రతి చోటా గం*జాయి నీ అలవాటు చేశాడు. ఇది పచ్చి నిజం. ఆంధ్ర లో యే తల్లి తండ్రులు నీ అడిగిన కూడా చెబుతారు, ఈ నిజం. ప్యాలస్ లో సెర్చ్ చేస్తే, కనీసం ఒక పెద్ద లారీ కంటైనర్ గాం*జాయి దొరకడం ఖాయం.
అందుకే ఆ ప్యాలస్ చుట్టూ అంట ప్రైవేటు సెక్యూరిటీ పెట్టుకున్నాడు.
రే*పు* కేసులో అ*రె*స్టు* అయ్యి వి*డు*ద*ల ఐనవాళ్లని సన్మానం చేసిన గొప్ప సమాజం మనది. చట్టసభల్లో బూ*తు* బొమ్మలు చూస్తూ దొరికినవాళ్లని మళ్లీ ఎన్నకొనే విశాల హృదయులు ఉన్నారు మనలోనే.
పాత రోజుల్లో శృంగార ప్రేరేపిత సాహిత్యం, మీడియా లు, మద్యం, బార్ , క్లబ్ లు
చాలా తక్కువ గా , అది కూడా రహస్యంగా కేవలం పెద్ద వారికి మాత్రమే అందుబాటులో వుండేవి.
ఒకవేళ ఎవరియన్ తుంటరి వాళ్ళు ప్రయత్న చేయాలన్న కూడా, అందుబాటులో వుండేవి కాదు.
పాత రోజుల్లో పల్లి టూర్లో పెద్ద వాళ్ళు వస్తె, కుర్రోళ్ళు తాగే సిగరెట్ నీ నేల మీదకి దూరంగా విసిరేసే వారు.
ఇప్పుడు ఆ సామాజిక కట్టుబాట్లు అన్నీ కూడా పోయి,
ఆ పైగా శృంగార ప్రేరేపిత పుస్తకాలు, యూట్యూబ్, ఇంటర్నెట్ , గంజాయి, బీర్ లు, మొబైల్ లు
మంచి చెడు లా తేడా తెలుసుకోలేని చిన్న పిల్ల లా వాళ్ళ చేతుల్లో కి రావడం వలన
మనస్సు మీద అదుపు తప్పి ఆఖరికి ఇంట్లో సొంత అక్క చెల్లి లా మీద కూడా అఘాయిత్యం చేసే పరిస్దితి లు వచ్చాయి.
వీటిని వ్యతిరేఖించకుండ ప్రోత్సహిస్తున్న పెద్ద వాళ్ళ అందరికీ ఇందులో భాగం వింది.