రామ్..రెమ్యూనిరేషన్ 15 కోట్లు?

అఖండ సినిమా తరవాత దర్శకుడు బోయపాటి సినిమా ఎవరితో అన్న ప్రశ్న…ప్రశ్నగానేే వుంది. మైత్రీ మూవీస్ పాత అడ్వాన్స్, సితార ఎంటర్ టైన్ మెంట్స్ కొత్త అడ్వాన్స్, గీతా కమిట్ మెంట్ వుండనే వున్నాయి.…

అఖండ సినిమా తరవాత దర్శకుడు బోయపాటి సినిమా ఎవరితో అన్న ప్రశ్న…ప్రశ్నగానేే వుంది. మైత్రీ మూవీస్ పాత అడ్వాన్స్, సితార ఎంటర్ టైన్ మెంట్స్ కొత్త అడ్వాన్స్, గీతా కమిట్ మెంట్ వుండనే వున్నాయి. కానీ ఎవరితో సినిమా అన్నదే సమస్య. 

గీతాలో బన్నీతో సినిమా అన్నది ప్లానింగ్ లో వుంది. కానీ బన్నీ ఫ్రీ కావడానికి కనీసం ఏడెనిమిది నెలల సమయం పడుతుంది.అందువల్ల ఈ లోగా ఎవరితో అయినా సినిమా చేయాలన్న ఆలోచనలు వున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ క్రమంలో హీరో రామ్ పేరు బయటకు వచ్చింది. కానీ రామ్..బోయపాటి సినిమాకు గమ్మతైన అడ్డంకి వచ్చిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు రామ్ సుమారు 15 కోట్ల రెమ్యూనిరేషన్ డిమాండ్ చేస్తున్నారని బోగట్టా. రామ్ కే 15 కోట్లు ఇస్తే, బోయపాటి అక్కౌంట్ లో కూడా 15 కోట్లు పడాల్సిందే. 

హీరో, డైరక్టర్ కే ముఫై కోట్లు పోతే మిగిలిన కాస్టింగ్, రెమ్యూనిరేషన్, ప్రొడక్షన్ కాస్ట్ అన్నీ కలిసి ఏకంగా వంద కోట్లు దాటేుస్తుంది ప్రాజెక్ట్ కాస్ట్. ఎందుకంటే బోయపాటి ప్రొడక్షన్ మామూలుగా వుండదు కదా.

అందుకే ఈ ప్రాజెక్టు అలా డిస్కషన్ స్టేజ్ లోనే వుండిపోయిందని తెలుస్తోంది. బోయపాటి-బన్నీ కాంబినేషన్ ఒకటి చర్చల్లో వుంది. బోయపాటి-పవన్ కాంబినేషన్ లో పోలిటికల్ సినిమా చేయాలనే ప్రయత్నాలు కూడా ఙరుగుతున్నాయి.