Advertisement

Advertisement


Home > Movies - Movie News

రామారావూ..ఐటమ్ సాంగూ

రామారావూ..ఐటమ్ సాంగూ

రవితేజ నటిస్తున్న లేటెస్ట్ సినిమా రామారావు ఆన్ డ్యూటీ. శరత్ మండవ దర్శకుడు..సుధాకర్ చెరుకూరి నిర్మాత. జూలై 29న విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఒక్కో పాట విడుదల చేస్తూ వస్తున్నారు. 

లేటెస్ట్ గా మరో పాట ప్రోమో వచ్చింది. ఐటమ్ సాంగ్ అనిపించే ఈ సాంగ్ మకుటమే చిత్రంగా వుంది. చంద్రబోస్ రాసిన ఈ పాట ‘నా పేరు సీసా’ అంటూ మొదలవుతోంది. సామ్ సిఎస్ పెప్పీ ట్యూన్ అందించారు. అన్వేషి జైన్ గ్లామర్ తోడయింది.

యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ లో రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్‌ కథానాయికలుగా నటిస్తుండగా, సీనియర్ హీరో వేణు తొట్టెంపూడి ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. 

ఇప్పటికే విడుదలైన మొదటి రెండు పాటలు మెలోడీ హిట్స్ గా నిలిచి ప్రేక్షకులని ఆకట్టుకున్నాయి. ఈ చిత్రానికి సత్యన్ సూర్యన్ ఐఎస్‌సి సినిమాటోగ్రఫీ అందించగా, ప్రవీణ్ కెఎల్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?