Advertisement

Advertisement


Home > Movies - Movie News

రంగమార్తాండ - మొత్తం వాషవుట్

రంగమార్తాండ - మొత్తం వాషవుట్

జ‌నాల అభిరుచి మారిపోతున్న వేళ వారికి మంచి సినిమా చూపించాలన్న తాపత్రయం అంతగా పనికిరాదేమో? లేదా అలా మంచి సినిమా తీస్తే దానికి సుగర్ కోట్ కూడా కావాలేమో? ఈ మద్య విడుదులైన రెండు సినిమాలు..బలగం..రంగమార్తాండ. భలే చిత్రమైన సారూప్యాలు వున్నాయి. 

రంగమార్తాండ అనుభవం పండించుకున్న దర్శకుడు కృష్ణవంశీ. హేమా హేమీ నటులు ప్రకాష్ రాజ్.. బ్రహ్మానందం..రమ్య కృష్ణ లాంటి సీనియర్లు. బలగం- ఒక కొత్త చిన్న దర్శకుడు. కొత్త, చిన్న, మీడియం నటులు.

రంగమార్తాండ పూర్తిగా దర్శకుడి అభిరుచి, అస్సలు కాంప్రమైజ్ కాని ధోరణి, సబ్జెక్ట్ ను సబ్జెక్ట్ గా అందించే ప్రయత్నం. బలగం మంచి విషయాన్ని జ‌నాలు నచ్చేలా చేసిన ప్రయత్నం. పది పదకొండు కోట్లు ఖర్చు రంగమార్తాండ కు. విడుదల నాటికే లాభాల్లో బలగం. రెండూ విడుదలయ్యాయి. రెండింటికీ మంచి ప్రశంసలు దక్కాయి. చూసిన ప్రతి ఒక్కరూ రెండు సినిమాలను మెచ్చుకున్నారు. రంగమార్తాండ కు ఒకింత ఎక్కువ ప్రశంసలే దక్కాయి.

కట్ చేస్తే థియేటర్లో మాత్రం రంగమార్తాండ. వీర ఫెయిల్యూర్. బలగం బ్లాక్ బస్టర్. మూడు కోట్లకు వరల్డ్ వైడ్ హక్కులు విక్రయిస్తే సగం కూడా రాలేదు రంగమార్తాండ కు. ఒక్క క్రాస్ రోడ్స్ లో తప్ప మరెక్కడా కలెక్షన్లు కనపడలేదు. అక్కడ కలెక్షన్ల వెనుక ఏముందో అనే గుసగుస. బలగం సినిమా కు లాభాలే లాభాలు.

దానా దీనా తేలేది ఏమిటంటే…మారుతున్న కాలంతో సినిమా టేకింగ్ కూడా మారాలి. మంచి సినిమా, జ‌నం మెచ్చే సినిమా అందించడమే కాదు. జ‌నానికి నచ్చే విధంగా అందించడం అవసరం. ఎంత అయినా కొత్త నెత్తురు కొత్తదే..ఆ ఉడుకు..వేడి..వాడి వేరే.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?