Advertisement

Advertisement


Home > Movies - Movie News

థమన్-మహేష్-వివాదం మొదటికి!

థమన్-మహేష్-వివాదం మొదటికి!

సర్కారు వారి పాట సినిమాకు థమన్ అందించిన వర్క్ కు ఇటు సూపర్ స్టార్ మహేష్ అటు ఆయన అభిమానులు విపరీతంగా ఫీల్ అయ్యారు. అదిగో అక్కడ స్టార్ట్ అయింది. తన సినిమాకు థమన్ వద్దు కాక వద్దు అని మహేష్ బాబు చెప్పడం. కానీ త్రివిక్రమ్ కిందా మీదా పడ్డారు. పూజా హెగ్డే, థమన్ ఇలా తన టీమ్ ను తీసుకునేలా మహేష్ బాబును ఒప్పించడానికి.

సినిమా ప్రీ ప్రొడక్షన్ దశలో మహేష్ బాబు విదేశాల్లో వున్నపుడు థమన్ ను తీసుకువస్తా అని త్రివిక్రమ్ చెబితే, వద్దు అని మహేష్ ఖరాఖండీగా చెప్పారని అప్పట్లో చెప్పుకున్నారు. తరువాత మొత్తానికి ఒప్పించారు. దుబాయ్ లో మహేష్ వుండగా థమన్ ను తీసుకెళ్లారు. రాజీ చేసారు. అంతా అయిపోయింది.

ఇప్పుడు సినిమా ప్రొడక్షన్ కూడా స్టార్ట్ అయిన తరువాత మళ్లీ మహేష్ కు థమన్ మధ్య‌ కోపం మొదటికి వచ్చిందని తెలుస్తోంది. దీనికి కారణం. మరేం లేదు. సినిమా పనులు మొదలై ఆరు నెలలు అయినా ఒక్క ట్యూన్ కూడా థమన్ నుంచి రాకపోవడమే. థమన్ అటు ఆహా షో, ఇటు క్రికెట్ పోటీ లతో బిజీగా వున్నారు. ఎవరి సినిమాలు కూడా పట్టించుకోకుండా పక్కన పెట్టారు. క్రికెట్ పోటీ సంస్థ నుంచి మాంచి రెమ్యూనిరేషన్ అందడమే కారణం అని గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి.

థమన్ ఆలోచించుకోవాలి. ఇప్పటికే థమన్ మీద చాలా గ్యాసిప్ లు వున్నాయి. థమన్ మనసు పెట్టి పని చేస్తే సూపర్ ఆల్బమ్ ఇస్తారు. ఇప్పుడు థమన్ ఒక్కరే తెలుగులో లీడింగ్ మ్యూజిక్ డైరక్టర్. కానీ థమన్ పార్క్ హయాత్ లోనే వుంటారు. అక్కడ ఖర్చు మామూలుగా వుండదు. పైగా ప్రతి వీకెండ్ ప్రసాద్ లాబ్ లో రికార్డింగ్ దగ్గర ఓ భారీ కెెఫటీరియా సెటప్ వుంది. వీటన్నింటిలో చాలా ఖర్చులు నిర్మాతల మీదే పడతాయి అని టాక్ వుంది. నిజ‌మెంతో థమన్ కే తెలియాలి. 

ఖర్చు అన్నది పెద్ద పాయింట్ కాదు. వర్క్ సకాలంలో జ‌రగాలి. బెస్ట్ అవుట్ పుట్ రావాలి. నిర్మాతలు పెద్దగా ఖర్చుకు ఫీల్ కారు. కానీ థమన్ దగ్గర సమస్య ఏమిటంటే విపరీతమైన అలసత్వం. అదే పెద్ద సమస్య. చివరి నిమిషం లో వర్క్ చేస్తే అది క్వాలిటీ రాదు. ఇప్పుడు మహేష్ ఫ్యాన్స్ కూడా అదే భయపడుతున్నారు. థమన్ ఎలాంటి పాటలు ఇస్తాడో అని. మహేష్ కూడా త్రివిక్రమ్ కాకపోయి వుంటే అస్సలు థమన్ కు ఓకె చేసి వుండేవారు కాదు అన్నది పక్కా.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?