రంగస్థలం టైటిల్ వచ్చినప్పుడు చాలామంది ఏంటో అనుకున్నారు, ఆ తర్వాత తెలిసింది అదో ఊరు పేరని. ఇప్పుడు అదే టైపులో రంగబలి వస్తోంది. ఇది కూడా ఊరు పేరే. రంగస్థలంలో రామ్ చరణ్ ఉన్నట్టు, రంగబలిలో నాగశౌర్య ఉన్నాడు. రంగబలి అనే ఊరి చుట్టూ తిరిగే పొలిటికల్ డ్రామాతో ఈ సినిమా తెరకెక్కినట్టు, ఈరోజు రిలీజైన ట్రయిలర్ చూస్తే అర్థమౌతోంది.
ఆవారా కుర్రాడిగా నాగశౌర్య చాలా ఈజ్ తో కనిపించాడు. ఇంతకుమందు తను చేసిన ఛలో సినిమా ఛాయలు ఈ క్యారెక్టర్ లో కూడా కనిపిస్తున్నాయి. పైగా పక్కనే సత్య కూడా ఉన్నాయి. స్పెర్మ్ అమ్మి డబ్బులు సంపాదించాలనే తపనతో కనిపించే యువకుడిగా సత్య, నవ్వులు పూయించాడు.
సరదా సన్నివేశాలతో పాటు, ఊరికి సంబంధించిన ఓ సీరియస్ సబ్జెక్ట్ ను సినిమాలో చర్చించినట్టు ట్రయిలర్ చూస్తే అర్థమౌతోంది. సొంత ఊరు ఫీలింగ్ తో ఉండే కుర్రాడు, ఊరిలోని ఓ బలమైన శక్తిని ఎలా అడ్డుకున్నాడో ట్రయిలర్ లో చూచాయగా చూపించారు. దీనికితోడు హీరోయిన్ యుక్తి తరేజాతో లవ్ ట్రాక్ కూడా పెట్టారు.
ట్రయిలర్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఫ్రేమ్స్ బాగున్నాయి. పవన్ బాసంశెట్టి డైరక్ట్ చేసిన ఈ సినిమాను జులై 7న రిలీజ్ చేయబోతున్నారు. ప్రచారాన్ని చాలా రోజుల కిందటే మొదలుపెట్టారు. ట్రయిలర్ రిలీజ్ తో అది పీక్ స్టేజ్ కు చేరింది.