ఒకప్పుడు హీరోలు అంటే ఎంతో హుందాగా ఉండేవారు. వారు చేసే పనులు, మాటలు అభిమానులు పాటించేవారు. కానీ ఇప్పుడు హీరోలే వివాదలు సృష్టించుకోని వారికి వారే బలహినపడున్నట్లు కనపడుతోంది.
బాజీరావ్ మస్తానీ స్టార్ బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ తన నగ్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు అతనిపై నమోదైన కేసులో ఇవాళ ముంబై పోలీసులు ఎదుట హజరయ్యారు.
గత నెలలో ముంబైలోని చెంబూర్ పోలీస్ స్టేషన్‌లో రణ్‌వీర్ సింగ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదైంది, ఆ తర్వాత కేసు విచారణలో పాల్గొనాల్సిందిగా పోలీసులు అతనికి నోటీసులు అందించారు. ఇవాళ ఉదయం 7 గంటలకు విచారణ అధికారి ముందు హాజరై వాంగ్మూలం ఇచ్చారు.
కాగా గతంలో రణ్ వీర్ సింగ్ ఫోటో ఘాట్ పై చాల మంది అభ్యంతరం వ్యక్తం చేశారు. కొంత మంది రణ్ వీర్ కు సపోర్టు కూడా చేశారు. ఏది ఎమైనా హీరోలు ఈ మధ్యకాలంలో వారికి ఇష్టం వచ్చినట్లు చేస్తు కావాల్సి మీడియాను తమ వైపు తిప్పుకున్నట్లు కనపడుతోంది. సినిమాల కంటే వివాదాలే హీరోలకు ఇష్టం ఉన్నట్లు కనపడుతోంది.