Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఎన్నికల వేళ డీప్ ఫేక్ వీడియోలు హల్ చల్

ఎన్నికల వేళ డీప్ ఫేక్ వీడియోలు హల్ చల్

ఓవైపు ఎన్నికల ప్రక్రియ మొదలవ్వగా, మరోవైపు డీప్ ఫేక్ వీడియోలు హల్ చల్ చేస్తున్నాయి. తమిళ రాజకీయాల్లో ఇప్పటికే ఇవి ఓ రేంజ్ లో విజృంభించిన సంగతి తెలిసిందే. చాలామంది జయలలిత, కరుణానిధికి చెందిన ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ వీడియోల్ని తమ ఎన్నికల ప్రచారంలో వాడుకున్నారు. అటు కొంతమంది హీరోల డీప్ ఫేక్ వీడియోలు కూడా ప్రత్యక్షమయ్యాయి. ఇప్పుడీ లిస్ట్ లోకి హీరో రణ్వీర్ సింగ్ కూడా చేరాడు.

రణ్వీర్ సింగ్ కు చెందిన ఓ డీప్ ఫేక్ వీడియో ప్రస్తుతం హల్ చల్ చేస్తోంది. ఆ వీడియోలో అతడు కేంద్ర ప్రభుత్వాన్ని తిడుతున్నాడు. న్యాయం కోసం పోరాడేవాళ్లు కాంగ్రెస్ కు ఓటేయాలని నినదిస్తున్నాడు. అయితే ఇది డీప్ ఫేక్ వీడియో అనే విషయం అందరికీ అర్థమైంది. ఇప్పుడీ అంశంపై స్వయంగా రణ్వీర్ స్పందించాడు

మిత్రులారా.. ఇది డీప్ ఫేక్ వీడియో.. జాగ్రత్త అంటూ పోస్ట్ చేశాడు రణ్వీర్. నిజానికి ఈ వీడియో అసలైనదే. మనీష్ మల్హోత్రా ఫ్యాషన్ షో కోసం రణ్వీర్ వారణాసికి వెళ్లినప్పుడు తీసిన వీడియో అది. పక్కనే కృతి సనన్ కూడా ఉంది. ఈ వీడియోను ఫేక్ చేశారు కొంతమంది. అటు కాంగ్రెస్ నేతలు కూడా కొంతమంది ఈ వీడియోను ఖండించడం విశేషం.

మొన్నటికిమొన్న అమీర్ ఖాన్ వీడియో ఒకటి డీప్ ఫేక్ అయింది. ఓ బ్రాండ్ ను సమర్ధిస్తూ, అమీర్ చేసినట్టున్న ఆ వీడియో క్షణాల్లో వైరల్ అయింది. దీనిపై అమీర్ స్పందించాడు. తనకు సంబంధం లేదని ప్రకటించాడు. అంతకంటే ముందు బాలీవుడ్ కు చెందిన చాలామంది హీరోయిన్లు డీప్ ఫేక్ కు గురైన సంగతి తెలిసిందే.

దీనిపై ఎన్ని చట్టాలు చేసినప్పటికీ, అవగాహన కల్పిస్తున్నప్పటికీ వీడియోలు మాత్రం ఆగడం లేదు. ఇప్పుడు ఎన్నికల సీజన్ కావడంతో, సెలబ్రిటీల వీడియోల్ని డీప్ ఫేక్ విధానంలో మార్ఫింగ్ చేసి చేసి, ఇలా ఏమాత్రం అనుమానం లేకుండా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. తెలియని వాళ్లు దీన్నే నిజమని నమ్మే ప్రమాదం ఉంది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?