తన భార్య దీపిక పదుకోన్ పై ఎక్కడలేని ప్రేమ కురిపిస్తున్నాడు హీరో రణ్వీర్ సింగ్. లాక్ డౌన్ టైమ్ లో తన కోసం దీపిక చాలా కష్టపడిందట. నేర్చుకొని మరీ కొన్ని వంటలు చేసిందట. తాజాగా ఆ విషయాన్ని బయటపెట్టాడు రణ్వీర్.
“నా భార్య ఓ అద్భుతమైన చెఫ్. లాక్ డౌన్ టైమ్ లో మేమిద్దరం చాలా బాగా ఎంజాయ్ చేశాం. ఆ టైమ్ లో నా కోసం దీపిక చాలా వంటకాలు చేసింది. మరీ ముఖ్యంగా చైనీస్ ప్రాన్స్ (రొయ్యలతో చేసే చైనీస్ వంటకం) చేయడంలో దీపిక ది బెస్ట్.”
ఇలా తన భార్య వంటకాల్ని పొగుడుతున్నాడు రణ్వీర్. అయితే తను మాత్రం వంట చేయలేదని, వంటతో కాకుండా తన భార్యను ఇంప్రెస్ చేసే పద్ధతులు తనకు బాగా తెలుసంటున్నాడు. లాక్ డౌన్ టైమ్ లో దీపికను బాగానే చూసుకున్నప్పటికీ, ఆమె కోసం కచ్చితంగా వండుతానని చెబుతున్నాడు.
“ఈమధ్య కొత్త ఇల్లు తీసుకున్నాం. నాకు వంట రాదు. అయినప్పటికీ కొత్తింట్లోకి వెళ్లిన తర్వాత కచ్చితంగా దీపిక కోసం బ్రేక్ ఫాస్ట్ చేస్తాను. నా ఒడిలో కూర్చోబెట్టుకొని, నా చేతులతో ఆమెకు టిఫిన్ తినిపిస్తాను.”
ఇలా భార్యపై తనకున్న ప్రేమను బయటపెట్టాడు రణ్వీర్. ఆమె కోసం ఎగ్ కర్రీ చేస్తానని గతంలోనే మాటిచ్చానని, తన అభిమానులు ఆ విషయాన్ని పదే పదే గుర్తు చేస్తున్నారని కూడా అన్నాడు. 2018లో దీపిక-రణ్వీర్ పెళ్లి చేసుకున్నారు.