చూపు తిప్పుకోలేని అందం.. అసలేం తింటోంది!

రష్మిక.. ప్రస్తుతం టాలీవుడ్ సెన్సేషన్. ఈమెకు సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈమెను తమ సినిమాల్లోకి తీసుకునేందుకు కొంతమంది హీరోలు కూడా ఎదురుచూస్తున్న పరిస్థితి. ఇలా కుర్రకారు గుండెల్లో సెగ రేపుతున్న రష్మిక, అసలు…

రష్మిక.. ప్రస్తుతం టాలీవుడ్ సెన్సేషన్. ఈమెకు సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈమెను తమ సినిమాల్లోకి తీసుకునేందుకు కొంతమంది హీరోలు కూడా ఎదురుచూస్తున్న పరిస్థితి. ఇలా కుర్రకారు గుండెల్లో సెగ రేపుతున్న రష్మిక, అసలు ఇంత అందంగా ఎలా ఉంటోంది.. ఆమె  రోజూ ఏం తింటోంది.. ? తన గ్లామర్ సీక్రెట్ తో పాటు డైట్ వివరాల్ని స్వయంగా రష్మిక చెప్పుకొచ్చింది.

ఉదయం లేచిన వెంటనే రష్మిక చేసే మొదటి పని ఫుల్లుగా నీరు తాగుతుంది. ఆ తర్వాత బ్రేక్ ఫాస్ట్ లో అవకోడా టోస్ట్ తింటుంది. అయితే రీసెంట్ గా అపాయింట్ చేసుకున్న డైటీషియన్ మాత్రం ఆమెను ఎక్కువ నీరు తాగనివ్వడం లేదట. దాని బదులు యాపిల్ జ్యూస్ ఇస్తోందట. ఇక అల్పాహారంలో కూడా అవకోడా టోస్ట్ తగ్గించేస్తోందట.

ఇక లంచ్ విషయానికొస్తే.. ఎక్కువగా సౌతిండియా భోజనాన్ని ఇష్టపడతానంటోంది రష్మిక. అయితే అందులో అన్నం తక్కువగా తింటుందట. తక్కువ అన్నంలో ఎక్కువ కూరలు కలుపుకొని తింటుందట. ఎందుకంటే అన్నం కంటే ఆ కూరగాయలే ఒంటికి మంచిదంటోంది. 

డిన్నర్ లో చాలా లైట్ ఫుడ్ తీసుకుంటానంటోంది. ఫ్రెండ్స్ తో కలిసి ఎక్కువగా డిన్నర్స్ చేస్తుంటానని, అయినా కూడా తక్కువే తింటానంటోంది. రోజులో ఎక్కువసార్లు తింటుంటానని, ఆ అలవాటు మానుకోలేకపోతున్నానని అంటోంది. 

మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. రష్మిక పూర్తిగా శాకాహారి. అయితే అన్ని రకాల వెజిటబుల్స్ తినదు. తనకు కీర, టమాట, కాప్సికమ్ అంటే అస్సలు ఇష్టముండదని.. వాటికి బదులుగా ప్రతి రోజూ గుడ్లు తింటానని చెబుతోంది.

సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న స్పెషల్ ఇంటర్వ్యూ