Advertisement

Advertisement


Home > Movies - Movie News

5 భాషల్లో సొంతంగా డబ్బింగ్ చెప్పిన రష్మిక

5 భాషల్లో సొంతంగా డబ్బింగ్ చెప్పిన రష్మిక

నేషనల్ క్రష్ రష్మిక మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఒకేసారి 5 భాషల్లో డబ్బింగ్ చెప్పి అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే సినిమా మొత్తం కాదు, కేవలం టీజర్ కోసం రష్మిక ఈ రిస్క్ చేసింది.

రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో 'ది గర్ల్ ఫ్రెండ్' అనే సినిమా చేస్తోంది రష్మిక. ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ చాలామందిని ఆకర్షించింది. ఆ తర్వాత సైలెంట్ గా షూట్ కొనసాగిస్తూ వచ్చారు. ఇప్పుడు టీజర్ రిలీజ్ చేసే టైమ్ వచ్చింది.

'ది గర్ల్ ఫ్రెండ్' టీజర్ ను ఒకేసారి 5 భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషలతో పాటు హిందీలో కూడా రిలీజ్ చేయబోతున్నారు. టీజర్ లో ఓ డైలాగ్ ఉంది. ఆ డైలాగ్ కు 5 భాషల్లో రష్మికనే సొంతంగా డబ్బింగ్ చెప్పింది.

తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఆమె వర్క్ చేసింది. కనీసం ఆ భాషలపై ఆమెకు కాస్త అవగాహన ఉంది. కానీ మలయాళంలో ఆమె ఇప్పటివరకు వర్క్ చేయలేదు. ఆ భాష కూడా ఆమెకు తెలీదు. అయినప్పటికీ డబ్బింగ్ చెప్పింది.

రష్మిక పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 5న 'ది గర్ల్ ఫ్రెండ్' టీజర్ ను విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో పాటు, స్వయంగాక కథను కూడా రాహులే రాసుకున్నాడు. గీతాఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ ఈ సినిమాను సమర్పిస్తున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?