రష్మిక రిచ్ మెయింటెనెన్స్.. చాలా కాస్ట్ లీ గురూ!

కోట్లు సంపాదించే హీరోహీరోయిన్లు, ఆ డబ్బంతా ఏం చేస్తారు? చాలామంది సామాన్యులకు మనసులో కలిగే సందేహం ఇది. ఒక్కో సినిమాకు కోట్ల రూపాయల్లో పారితోషికాలు తీసుకునే వీళ్లంతా ఆ డబ్బును ఎలా ఖర్చుపెడతారు, ఎలా…

కోట్లు సంపాదించే హీరోహీరోయిన్లు, ఆ డబ్బంతా ఏం చేస్తారు? చాలామంది సామాన్యులకు మనసులో కలిగే సందేహం ఇది. ఒక్కో సినిమాకు కోట్ల రూపాయల్లో పారితోషికాలు తీసుకునే వీళ్లంతా ఆ డబ్బును ఎలా ఖర్చుపెడతారు, ఎలా పెట్టుబడులు పెడతారనే సందేహం అందర్లో ఉంటుంది. ఉదాహరణకు రష్మికనే తీసుకుందాం.

ప్రస్తుతం సౌత్ లో టాప్ హీరోయిన్స్ లో ఒకరిగా కొనసాగుతోంది రష్మిక.. ఈమె సంపాదనతో మంచి లైఫ్ లీడ్ చేస్తోంది. కోట్ల సంపాదనను ఓవైపు పెట్టుబడులుగా పెడుతూనే, మరోవైపు తన ఖర్చులు, లగ్జరీల కోసం వెచ్చిస్తోంది. రష్మిక లైఫ్ స్టయిల్ చూస్తే ఎవరికైనా కళ్లు తిరగాల్సిందే.

రష్మిక దగ్గర లగ్జరీ కార్లు ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 3 ఉన్నాయి. ఆడి క్యూ3, మెర్సిడెజ్ బెంజ్ సి-క్లాస్ తో పాటు, టాలీవుడ్ ఫేవరెట్ బండి రేంజ్ రోవర్ ఎస్ యూ వీ కూడా ఉంది. ఇవి కాకుండా ఇన్నోవా, హుందాయ్ క్రెటా కార్లు కూడా రష్మిక దగ్గరున్నాయి. తన మూడ్, అకేషన్ బట్టి ఈ కార్లను వాడుతుంటుంది ఈ ముద్దుగుమ్మ.

ఇక పెట్టుబడుల విషయానికొస్తే, రష్మిక తన సంపాదనలో కొంత భాగాన్ని కుటుంబ వ్యాపారంలో పెడుతుంది. ఇవి కాకుండా గత నెల ఆమె ముంబయిలో ఓ ఖరీదైన, అందమైన ఇల్లు కొనుగోలు చేసింది. తన సొంత ఇంట్లో ఉంటూనే బాలీవుడ్ సినిమాలు చేస్తోంది. ఈ ఇల్లు, బెంగళూరులో ఉన్న బంగళాలు కాకుండా.. కర్నాటకలోనే ఆమెకు మరో పెద్ద విల్లా కూడా ఉంది. దాని రేటు అటు ఇటుగా 6 నుంచి 8 కోట్ల రూపాయల రేటు చేస్తుంది. ఇవి కాకుండా దేశవ్యాప్తంగా రష్మికకు స్థిరాస్తులున్నాయి.

ఇక మెయింటైనెన్స్ విషయానికొస్తే లగ్జరీ కార్లతో పాటు.. లగ్జరీ యాక్ససిరీస్ వాడుతుంది రష్మిక. మినిమం లక్ష రూపాయల నుంచి 3 లక్షల రూపాయల ఖరీదు చేసే లగ్జరీ బ్యాగ్స్ రష్మిక దగ్గరున్నాయి. వీటితో పాటు హీల్స్, షూజ్ కు కూడా ఆమె లక్షల్లో ఖర్చు చేస్తుంది. కళ్లజోడు, హ్యాండ్ బ్యాగ్ నుంచి షూ వరకు అన్నీ ఇంటర్నేషనల్ ఫ్యాషన్ బ్రాండ్సే వాడుతుంది రష్మిక.

ఇక ఆమె ధరించే దుస్తుల బ్రాండ్స్ లిస్ట్ తీస్తే చాంతాడంత అవుతుంది. ఆమె వార్డ్ రోబ్ నిండా ఖరీదైన ఫ్యాషన్ బ్రాండ్స్ కనిపిస్తాయి. టీ షర్ట్, జీన్స్, టాప్స్ నుంచి దాదాపు అన్ని రకాల దుస్తుల్ని ఆమె లగ్జరీ బ్రాండ్స్ తో నింపేసింది. ప్రతి నెల వీటి ఖర్చు లక్షల్లో ఉంటుందట. ఇలా రిచ్ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది ఈ కన్నడ బ్యూటీ.

ప్రస్తుతం తెలుగులో రష్మిక చేతిలో పుష్ప సినిమాతో పాటు ఆడాళ్లు మీకు జోహార్లు అనే సినిమా ఉంది. అటు బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ 2 సినిమాలకు కమిట్ అయింది ఈ బ్యూటీ.