కుర్రకారును మత్తెక్కించే అందగత్తె రష్మిక మందన్నా ప్రేమలో పడ్డారు. సినీ రంగంలో ఉన్న వారి ప్రేమ సంగతుల గురించి రకరకాల గుసగుసలు వినిపిస్తుంటాయి. రష్మిక మందన్నా గురించి కూడా గత కొంత కాలంగా ఎన్నెన్నో పుకార్లు షికార్లు చేశాయి.
తాజాగా తన ప్రేమ విషయాన్ని ఆమె స్వయంగా ప్రకటించారు. అంతేకాదండోయ్, తాను ప్రేమలో పడ్డ ప్రాణి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
సాధారణంగా ఎవరైనా ప్రేమలో పడడానికి మూడు సెకన్ల సమయం పడుతుందని, తాను మాత్రం మూడు మిల్లీ సెకన్లలోనే పడిపోయినట్టు రష్మిక చెప్పుకొచ్చారు. రష్మిక ప్రేమలో ట్విస్ట్ ఏంటంటే…ఆమె ప్రేమకు నోచుకున్నది మనిషి మాత్రం కాదు. అది రష్మిక లిటిల్ పెట్ జౌరా కావడం విశేషం.
‘ఈ ఇబ్బందికర పరిస్థితుల్లోనూ నాకు ఆనందాన్ని ఇచ్చిన నా లిటిల్ పెట్‌ను మీకు పరిచయం చేస్తున్నా’ అంటూ తన పెట్ డాగ్ ఫొటోలను సోషల్ మీడియాలో రష్మిక పోస్ట్ చేశారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.