హీరోతో ప్రేమాయ‌ణం…వ‌దంతులే అంటున్న హీరోయిన్‌

సినిమా రంగం అన్న త‌ర్వాత హీరోహీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితంపై ర‌క‌ర‌కాల ప్ర‌చారాలు జ‌రుగుతుంటాయి. వాటిలో గ్యాసిప్సే ఎక్కువ‌. నిజాల కంటే ఊహ‌లే మ‌ధురంగా ఉండ‌డంతో, వాటికే ఎక్కువ ప్ర‌చారం వ‌స్తోంటోంది. త‌మ‌పై వ‌చ్చే ఊహాగానాల‌పై…

సినిమా రంగం అన్న త‌ర్వాత హీరోహీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితంపై ర‌క‌ర‌కాల ప్ర‌చారాలు జ‌రుగుతుంటాయి. వాటిలో గ్యాసిప్సే ఎక్కువ‌. నిజాల కంటే ఊహ‌లే మ‌ధురంగా ఉండ‌డంతో, వాటికే ఎక్కువ ప్ర‌చారం వ‌స్తోంటోంది. త‌మ‌పై వ‌చ్చే ఊహాగానాల‌పై స్పందించ‌కుంటే అవే నిజ‌మ‌ని సోష‌ల్ మీడియాలో నిర్ధారించి తెగ వైర‌ల్ చేస్తుంటారు.

బ‌హుశా ఈ ప్ర‌మాదాన్ని ప‌సిగ‌ట్టిన హీరోయిన్ ర‌ష్మిక త‌న‌పై జ‌రుగుతున్న ప్ర‌చారంపై స్పందించారు. ఓ హీరోతో డేటింగ్ చేస్తోంద‌నే వార్త‌పై ర‌ష్మిక సీరియ‌స్‌గా రియాక్ట్ అవుతూ…అవ‌న్నీ కేవ‌లం వ‌దంతులే అని కొట్టి పారేశారు. త‌న ప్రేమాయ‌ణంపై ఇంకా ఏమ‌న్నారంటే…

‘ నేను సింగిల్‌గా ఉన్నా. నాకు ఇలా ఒంటరిగా ఉండటమే ఇష్టం. సింగిల్‌గా ఉన్నామని బాధపడే వారికి ఇదే నా సలహా.. జీవితంలో ఒంటరిగా, ఆనందంగా ఉండటం తెలుసుకుంటే.. మనకు కాబోయే జీవిత భాగస్వామిపై కూడా అంచనాలు ఇంకా పెరుగుతాయి’ అని ఆమె పేర్కొన్నారు.  ఇప్ప‌టికైనా ర‌ష్మిక ప్రేమ వ్య‌వ‌హారంపై జ‌రుగుతున్న ప్ర‌చారానికి తెర ప‌డుతుందా?  లేదా? అనేది కాల‌మే తేల్చాల్సి ఉంది.

ఆశలు వదిలేసుకున్నట్టేనా?

అయ్యన్నకు ఇస్తున్న విలువ ఏంటి?