టైమింగ్, స్ట్రాటజీ చూసి ఈ సినిమాకు ఓకే చెప్పలేదు

కెరీర్ లో తొలిసారి ఓ ఫిమేల్ ఓరియంటెడ్ సబ్జెక్ట్ కు ఓకే చెప్పింది రష్మిక. ఆ సినిమా పేరు రెయిన్ బో. ఈరోజు ఈ మూవీ లాంఛ్ అయింది. ఉన్నఫలంగా ఇలా లేడీ ఓరియంటెడ్…

కెరీర్ లో తొలిసారి ఓ ఫిమేల్ ఓరియంటెడ్ సబ్జెక్ట్ కు ఓకే చెప్పింది రష్మిక. ఆ సినిమా పేరు రెయిన్ బో. ఈరోజు ఈ మూవీ లాంఛ్ అయింది. ఉన్నఫలంగా ఇలా లేడీ ఓరియంటెడ్ సినిమాలవైపు రష్మిక మొగ్గుచూపడంపై చాలా డిస్కషన్ నడుస్తోంది. దీనికి రష్మిక క్లారిటీ ఇచ్చింది

ఫిమేల్ ఓరియంటెడ్ లేదా మేల్ ఓరియంటెడ్ అనే లెక్కలు వేసుకోనంటోంది రష్మిక. స్క్రిప్ట్ నచ్చితే ఓకే చెబుతానని, ఫైనల్ గా థియేటర్లలోకి వచ్చిన తర్వాత సినిమాకు డబ్బులొచ్చాయా లేదా అనేది మాత్రమే చూస్తానంటోంది.

“టైమింగ్ చూసి, స్ట్రాటజీ పెట్టి ఈ సినిమాకు ఓకే చెప్పలేదు. నిజానికి అలా చేయడం కూడా నాకు తెలియదు. ఓ కథ చేస్తే అందరికీ నచ్చాలి. కెరీర్ లో నన్ను మరో 4 అడుగులు ముందుకు తీసుకెళ్లాలి. ఆ ఆలోచనతోనే ఈ స్క్రిప్ట్ కు ఓకే చెప్పాను. ఇండస్ట్రీలో ఇప్పుడు పెద్ద సినిమాలు చేస్తున్నాను, పెద్ద హీరోలతో చేస్తున్నాను. అలా అని ఈ స్క్రిప్ట్ కు నో చెప్పడానికి నా దగ్గర కారణాల్లేవు. కథ నాకు బాగా నచ్చింది. ఓకే చెప్పాను.”

ఇలా రెయిన్ బో సినిమాకు ఓకే చెప్పడం వెనక కారణాన్ని బయటపెట్టింది రష్మిక. ఇకపై రష్మిక ఇలాంటి కథలు మాత్రమే చేస్తుందేమో అనే అనుమానాలకు కూడా ఫుల్ స్టాప్ పెట్టింది.

“భవిష్యత్తులో ఫిమేల్ ఓరియంటెడ్ సినిమాలు మాత్రమే చేయాలనే ప్లాన్ లేదు. అన్ని రకాల సినిమాలు చేస్తాను. ఆడియన్స్ కు, నా ఫ్యాన్స్ కు నచ్చుతుందనిపిస్తే ఏదైనా చేస్తా. ఇప్పటివరకు ఎలా చేస్తున్నానో, భవిష్యత్తులో కూడా అదే పద్ధతి ఫాలో అవుతా. నయనతారలా లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేయాలనే ఆశ లేదు.”

రెయిన్ బో సినిమాలో ఓ అందమైన ప్రేమకథ ఉందంటోంది రష్మిక. అదే టైమ్ లో అద్భుతమైన ట్విస్ట్ కూడా ఉందని, అది ఇప్పుడే బయటపెట్టడం కరెక్ట్ కాదని చెబుతోంది. “రెయిన్ బో (ఇంద్రధనుస్సు)ను దూరం చూసి చూసి ఎంజాయ్ చేయాలి. అంతేతప్ప, దాన్ని టచ్ చేయలేం.” ఈ పాయింట్ పైనే సినిమా ఉంటుందని చెబుతోంది రష్మిక.