రేట్లు ఊరికే పెంచేయరు..కొరటాల

సినిమా బడ్జెట్ ను బట్టే టికెట్ రేట్లు వుంటాయని, ఓ ఊరికే రేట్లు పెంచడం కాదు అని దర్శకుడు కొరటాల అన్నారు. మీడియాతో మాట్లాడుతున్నపుడు ‘చిరంజీవి సినిమాకు జ‌నం బాగా వస్తారు. ఫుల్స్ వస్తాయి.…

సినిమా బడ్జెట్ ను బట్టే టికెట్ రేట్లు వుంటాయని, ఓ ఊరికే రేట్లు పెంచడం కాదు అని దర్శకుడు కొరటాల అన్నారు. మీడియాతో మాట్లాడుతున్నపుడు ‘చిరంజీవి సినిమాకు జ‌నం బాగా వస్తారు. ఫుల్స్ వస్తాయి. దీనికి కూడా రేట్లు పెంచాలా?’ అన్న ప్రశ్న ఎదురయింది. దానికి కొరటాల కాస్త ఆవేశంగా స్పందించారు. 

‘ఆఫీసుకు రండి…అక్కౌంట్స్ ఇంకా చూడలేదు. నాలుగేళ్లు పని చేసారు మెగాస్టార్ చిరంజీవి..ఇంకా రెమ్యూనిరేషన్ తీసుకోలేదు. చరణ్ నలభై రోజులు చేసి రెమ్యూనిరేషన్ తీసుకోలేదు. నేను నాలుగేళ్లు పని చేసి రెమ్యూనిరేషన్ తీసుకోలేదు.పెట్టబడి రావాలి’ అంటూ సుదీర్ఘంగా వివరణ ఇచ్చారు.

ఇదే సమయంలో మెగాస్టార్ కూడా కలుగ చేసుకుని, పాండమిక్ టైమ్ వల్ల చాలా అదనపు భారం పడిందని, ఎవరు ఇస్తారని? ప్రేక్షకులకు తాము వినోదం ఇవ్వాలనే అనుకుంటున్నాం కనుక ప్రేక్షకులే పెద్దమనసుతో ఇవ్వాల్సి వుంటుందని అన్నారు.

ప్రెస్ మీట్ లో కొరటాల కాస్త అసహనంతో కనిపించారు. రిపీట్ ప్రశ్నలు అనో, మరోటి అనో ఆయన కౌంట్ ఇస్తూ వచ్చారు. ముఖ్యంగా కాజ‌ల్ పై ప్రశ్నకు సమాధానం ఇవ్వమన్నపుడు కాస్త చిరాకు పడ్డారు. 

తాను వివరంగా చెప్పానని, మళ్లీ అదే మెగాస్టార్ నోటి వెంట కూడా చెప్పించాలను అనుకుంటున్నారా అని ఎదురు ప్రశ్నించారు.