స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో అరెస్టై జైల్లో ఉన్న మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై టాలీవుడ్ నటుడు, డైరెక్టర్ రవిబాబు స్పందించారు. జీవితంలో ఏవీ శాశ్వతం కాదని.. సినిమా వాళ్ల గ్లామర్ గానీ.. రాజకీయ నాయకుల పవర్ గానీ శాశ్వతం కాదంటూ.. చంద్రబాబుకు వచ్చిన కష్టాలు కూడా త్వరలోనే తొలగిపోతాయని ఓ వీడియో విడుదల చేశారు.
రవిబాబు మాట్లాడుతూ.. ఎన్టీఆర్ ఫ్యామిలీ, చంద్రబాబు కుటుంబం తన కుటుంబానికి ఆప్తులని.. చంద్రబాబు డబ్బు కోసం కక్కుర్తి పడే మనిషి కాదని సరైన ఆధారం లేకుండా 73 ఏళ్ల చంద్రబాబును జైల్లో పెట్టి ఎందుకు వేధిస్తున్నారో అర్ధం కావడం లేదని.. చంద్రబాబు అందరినీ సంప్రదించే నిర్ణయాలు తీసుకుంటారని.. భూమి మీద ఇవాళే చివరి రోజు అని తెలిసినా నెక్స్ట్ యాభై సంవత్సరాలకు సరిపోయే అభివృద్ధి గురించే ఆలోచిస్తారని. చంద్రబాబును బయట ఉంచి ఇన్వెస్టిగేట్ చేసుకోవాలని.. ఆయన దేశం వదిలి పారిపోరు కదా అంటూ హితవు పలికారు.
రవిబాబుతో టీడీపీ పార్టీకి ఉన్న అనుబంధం గురించి అందరి తెలిసిందే. ఇప్పటికే టాలీవుడ్‌లో చంద్రబాబు సామాజిక వర్గ నిర్మాతలు, దర్శకులు చంద్రబాబు అరెస్ట్‌ను ఖండించగా రవిబాబు కాస్తా లేట్‌గా స్పందించారు. రవిబాబు గతంలో టీడీపీ పార్టీ కోసం యాడ్స్ చేశారు. కాగా రవిబాబు వీడియోలో మిగతా సినిమా వారి లాగా జగన్‌పై శాపనార్థాలు పెట్టకుండా రిక్వెస్ట్‌గా మాట్లాడటం విశేషం.