Advertisement

Advertisement


Home > Movies - Movie News

రావిపూడి...మహేష్..మళ్లీ మరోసారి

రావిపూడి...మహేష్..మళ్లీ మరోసారి

సరిలేరు నీకెవ్వరు టైమ్ లో హీరో మహేష్ బాబు దర్శకుడు అనిల్ రావిపూడికి బాగా కనెక్ట్ అయిపోయారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య అనుబంధం పెనవేసుకుంది. 

అప్పట్లోనే మరో సినిమా ఇదే కాంబినేషన్ లో తయారవుతుందని వార్తలు వినిపించాయి. కానీ మెటీరియలైజ్ కాలేదు. కానీ ఇప్పటికీ ఏమాత్రం అవకాశం కుదిరినా అనిల్ రావిపూడితో సినిమా చేసే ఆలోచనలో మహేష్ బాబు వున్నట్లు తెలుస్తోంది.

త్రివిక్రమ్ సినిమా తరువాత రాజమౌళి సినిమా వుంది. ఈ లోగా అవకాశం కుదరకపోతే ఆ సినిమా తరువాత అయినా అనిల్ రావిపూడితో సినిమా చేసే ఆలోచనలో మహేష్ వున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఓ పార్టీలో అందరి ముందు ఈ విషయాన్ని మహేష్ నే వెల్లడించినట్లు బోగట్టా.

అలవైకుంఠపురములో లాంటి సినిమా పోటీ కారణంగా సరిలేరు నీకెవ్వరు పెద్ద గీత ముందు చిన్న గీత మాదిరిగా అయిపోయింది. కానీ మహేష్ కెరీర్ లో మంచి కలెక్షన్లు అందుకున్న సిన్మాల్లో అదీ ఒకటి.

బహుశా అందుకే కావచ్చు అనిల్ రావిపూడికి మంచి మార్కులు పడుతున్నాయి మహేష్ దగ్గర.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?