హీరో ప్రభాస్ ది భారీ పర్సనాలిటీ. ఒడ్డు, పొడవు..దానికి తగ్గ బాడీ. అయితే జీన్స్ కావచ్చు..బాడీ ఇట్టే భారీగా పెరుగుతుంటుంది. తగ్గించుకుంటూ వుండాల్సిందే. పైగా ప్రభాస్ భోజన ప్రియుడు అని టాక్ కూడా వుంది.
మొత్తం మీద ఇటీవల ప్రభాస్ ఫిజిక్ ఇటీవల కాస్త షేప్ అవుట్ అయిందన్నది వాస్తవం. ఇప్పుడు ఒక పక్క ప్రాజెక్ట్ కే షూట్ చేస్తూనే, ఇటు సన్నబడే పనిలో కూడా ప్రభాస్ బిజీ గా వున్నాడని తెలుస్తోంది.
ఇదిలా వుంటే సలార్ సినిమాను కూడా ప్రభాస్ ఫినిష్ చేయాల్సి వుంది. ఈ సినిమా వర్క్ దాదాపు యాభై శాతానికి పైగానే పెండింగ్ లో వుందని తెలుస్తోంది. సలార్ తరువాత సలార్ 2 సినిమా కూడా వుంటుంది.
సలార్ ను సంక్రాంతి బరిలోకి దింపాలి. కానీ షూట్ ప్రారంభించాలంటే ప్రభాస్ కొన్ని కిలోలు తగ్గాల్సిందే అని దర్శకుడు ప్రశాంత్ నీల్ కండిషన్ పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రభాస్ దృష్టి అంతా ఇప్పుడు ఈ మూడు ప్రాజెక్ట్ ల మీదే వుందని, మారుతి తో చేయాల్సిన సినిమాను తాత్కాలికంగా వెనక్కు పెట్టారని తెలుస్తోంది.
మారుతి కూడా తనకు తొందర లేదని, బౌండ్ స్క్రిప్ట్ రెడీ చేసుకుని, ఫైన్ ట్యూన్ చేసుకుంటానని, ఎప్పుడు అంటే అప్పుడే షూట్ కు వెళ్లాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.