Advertisement

Advertisement


Home > Movies - Movie News

రావిపూడి...ర్యాపిడ్ ఫైర్

రావిపూడి...ర్యాపిడ్ ఫైర్

ఎఫ్ 3 దర్శకుడు అనిల్ రావిపూడి తో ఫోన్ లో ర్యాపిడ్ ఫైర్ సెషన్

#ఎఫ్ 3 ఒక్క మాటలో...

ప్రతి తెలుగు ప్రేక్షకుడికి గిలిగింతలు పెట్టే సినిమా

#వెంకీ గురించి వన్ వర్డ్

పాజిటివ్..పాజిటివ్..పాజిటివ్

#మీరు డైరెక్ట్ చేస్తున్న రెండో మెగాహీరో వరుణ్ గురించి

స్ఫ్రెడింగ్ లవ్…లైక్ ఎ బ్రదర్

#తమన్నాతో గొడవయిందా?

మీరు ఎలా అనుకుంటే అలా.

#రాజేంద్రప్రసాద్ మనసు ఎలా దోచారు?

ఆయన నవ్వు నా మనసు దోచింది.

#చిరంజీవితో చాన్స్ వస్తే ఎలాంటి సినిమా చేస్తారు?

ఓ మంచి గ్యాంగ్ లీడర్..రౌడీ అల్లుడు లాంటి సినిమా

#కొత్త వాళ్లను ఎందుకు పరిచయం చేయరు?

నాతో చేయాలనుకుంటే చాలు చేసేస్తాను

#మీ రెమ్యూనిరేషన్ ఎంత అంటే టక్కున చెప్పగలరా?

మీరు ఎంత అనుకుంటే అంత

#దిల్ రాజు బ్యానర్ లో పాన్ ఇండియా సినిమా

సినిమా చేయమంటే చేయడమే..ఏ ఇండియా అన్నది పాయింట్ కాదు.

#మీరు ఎప్పటికైనా కచ్చితంగా సినిమా చేయాలనుకునే హీరో?

చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లతో చేయాలి. వెంకీతో చేసా, బాలయ్యతో చేయబోతున్నా

#మీరు ఎప్పటకైనా చేయాలనుకునే జానర్?

జగదేక వీరుడు అతిలోక సుందరి లాంటి మాంచి సోషియో ఫాంటసీ

#పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని ఆయన ఫ్యాన్స్ కోరిక..మీ సమాధానం?

ఎనీ టైమ్..స్లాట్ వుంది. అంటే దూకేయడానికి రెడీ

#ఎఫ్ 3 కి మీ రేటింగ్?

రేటింగ్ ఇచ్చేది మీలాంటి విశ్లేషకులు..ప్రేక్షకులు. తీయడం వరకే నా బాధ్యత

-విఎస్ఎన్.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?