సంక్రాంతి బరిలోకి రవితేజ కూడా..!

చాలామంది హీరోలకు ఉన్నట్టుగానే రవితేజకు కూడా సంక్రాంతి సెంటిమెంట్ ఉంది. అతడు నటించిన క్రాక్ సినిమా సంక్రాంతి బరిలోనే సూపర్ హిట్ కొట్టింది. అందుకే సంక్రాంతికి రవితేజ కూడా రెడీ అయ్యాడు. ఈసారి ఈగల్…

చాలామంది హీరోలకు ఉన్నట్టుగానే రవితేజకు కూడా సంక్రాంతి సెంటిమెంట్ ఉంది. అతడు నటించిన క్రాక్ సినిమా సంక్రాంతి బరిలోనే సూపర్ హిట్ కొట్టింది. అందుకే సంక్రాంతికి రవితేజ కూడా రెడీ అయ్యాడు. ఈసారి ఈగల్ వంతు.

'ధమాకా' లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత రవితేజ, పీపుల్ మీడియా మరోసారి కలిశాయి. ఈసారి మరింత కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అందుకే పోటీ ఉన్నప్పటికీ సంక్రాంతికే వద్దామని ఫిక్స్ అయ్యారు.

కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కుతోంది 'ఈగల్' సినిమా. ఇప్పటికే ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరోవైపు సినిమా కూడా బాగా వస్తోందనే టాక్ ఉంది. అందుకే మేకర్స్ సంక్రాంతిని టార్గెట్ చేశారు. జనవరి 13న థియేటర్లలోకి వస్తామని తాజాగా ప్రకటించారు.

సంక్రాంతి బరిలో ఉన్న సినిమాల లిస్ట్ రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే గుంటూరు కారం బరిలో ఉంది. తాజాగా విజయ్ దేవరకొండ సినిమా కూడా రాబోతున్నట్టు ప్రకటించారు. ఆల్రెడీ లిస్ట్ లో నా సామిరంగ, హనుమాన్ సినిమాలున్నాయి. సలార్ దెబ్బతో క్రిస్మస్ కు రావాల్సిన సైంధవ్ కూడా సంక్రాంతికి అంటున్నారు. శివకార్తికేయన్ నటించిన అయలాన్ మూవీ కూడా ఉంది. ఇప్పుడు ఈగల్ కూడా వచ్చి చేరింది.

ఈగల్ విషయానికొస్తే, ఈ సినిమాలో మల్టీ షేడ్స్ ఉన్న పాత్ర పోషిస్తున్నాడు రవితేజ. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుండగా, కావ్య థాపర్ సెకెండ్ హీరోయిన్ గా కనిపించనుంది. నవదీప్, మధుబాల కీలక పాత్రల్లో కనిపించనున్నారు.