Advertisement

Advertisement


Home > Movies - Movie News

రవితేజ..కన్ఫ్యూజ్ కామెడీ

రవితేజ..కన్ఫ్యూజ్ కామెడీ

రవితేజ పక్కా కామెడీ చేసినపుడల్లా థియేటర్లు ఊగాయి. అలా కాకుండా డిఫెరెంట్ గా ట్రయ్ చేద్దాం..అనుకున్నపుడే సమస్యలు ఎదురయ్యాయి. 

ఈసారి రవితేజ నుంచి వస్తున్న ఢమాకా సినిమా అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్ టైన్ మెంట్. అస్సలు ప్రయోగాలు లేవు. ఓన్లీ మాస్ ఆడియన్స్ టార్గెట్ అంట. అసలేంటీ ఇలా అంటున్నారు దర్శకుడు నక్కిన త్రినాధరావు అంటే అసలు సంగతి వేరే వుందని తెలుస్తోంది.

ఢమాకా సినిమా గతంలో శ్రీనువైట్ల లాంటి దర్శకులు అందించిన కన్ఫ్యూజ్ కామెడీ లైన్ లో సాగుతుందని తెలుస్తోంది. ఒకప్పుడు దాదాపు అందరు హీరోలు ఈ టైపు క్యారెక్టర్లు చేసారు. రవితేజ కూడా. అలా చేసిన ప్రతి సినిమా టార్గెట్ రీచ్ అయింది. ఈసారి కూడా నక్కిన అదే మ్యాజిక్ ను నమ్ముకున్నాడని తెలుస్తోంది.

ఢమాకాలో రవితేజ..డబ్బున్న ఆసామీ..పేద కుర్రాడు ఇలా రెండుగా కనిపిస్తాడు. డబుల్ రోల్ నా? సింగిల్ రోల్ నా అన్న అనుమానం వెంటాడుతూనే, ప్రేక్షకుడు ఎంటర్ టైన్ అవుతాడు. అదీ కాన్సెప్ట్ అంట. పెళ్లిసందడి తరువాత శ్రీలీల చేస్తున్న సినిమా ఇది. ఇప్పటికే ఈ సినిమాలో ఓసాంగ్ భయంకరంగా వైరల్ అయింది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?