Advertisement

Advertisement


Home > Movies - Movie News

ట్రోల్స్ కు ఫుల్ ప‌ని ఇచ్చిన డీఎస్పీ, థ‌మ‌న్!

ట్రోల్స్ కు ఫుల్ ప‌ని ఇచ్చిన డీఎస్పీ, థ‌మ‌న్!

అటు దేవీశ్రీ ప్ర‌సాద్, ఇటు థ‌మ‌న్.. ఇద్ద‌రూ సోష‌ల్ మీడియాలో ట్రోలింగ్ పేజీల‌కు ఫుల్ గా ఉపాధి క‌ల్పించారు. చిరంజీవి సినిమా పాట ద్వారా దేవీశ్రీ, బాల‌కృష్ణ సినిమా పాట ద్వారా థ‌మ‌న్ .. ఇద్ద‌రూ ఒక రేంజ్ హ‌డావుడి చేస్తూ వీడియోలు వ‌దిలారు. ఇవి కాస్తా.. న‌వ్వుల పాల‌వుతూ ఉన్నాయి. ఆ పాట‌లు హిట్టా, ఫ‌ట్టా అనే సంగ‌తిని ప‌క్క‌న పెడితే ట్రోలింగ్ మాత్రం ఒక రేంజ్ లో ఉంది!

'నువ్వు లుంగీ ఏస్కో.. క‌ర్చిఫ్ క‌ట్టుకో..' అంటూ డీఎస్పీ అరుపుల‌కు 'అండ‌ర్ వేర్.. వేయ‌డం మ‌రిచిపోయిన‌ట్టున్నావ్..' అనే పంచ్ తో మొద‌లుకుని.. ఈ పాట శైలిని ట్రోల్ చేయ‌డం అనేక ర‌కాలుగా సాగుతూ ఉంది. సోష‌ల్ మీడియాలోని మీమ్స్ పేజీల‌కు దేవీశ్రీ ఇలా ఫుల్ గా అవ‌కాశం ఇచ్చారు. 

ఇక సోష‌ల్ మీడియా ట్రోల్స్ కు బాగా న‌చ్చే వ్య‌క్తుల్లో ఒక‌రు థ‌మ‌న్. త‌న‌వైన కాపీ స్వ‌రాల‌తో థ‌మ‌న్ ఎప్పుడూ సోష‌ల్ మీడియాలో నానుతూనే ఉంటారు. అయితే ఎవ‌డేమ‌నుకుంటే త‌న‌కేం అన్న‌ట్టుగా కాపీయే రైటు అన్న‌ట్టుగా థ‌మ‌న్ ధోర‌ణి కొన‌సాగుతూ ఉంది.

జాన‌ప‌దాలు, పాత సినిమాలు, విదేశీ ఆల్బ‌మ్ లు, హిందీ సినిమాల్లోని 90స్ సాంగ్స్.. ఇలా దేన్నీ వ‌ద‌ల‌కుండా థ‌మ‌న్ ఎప్ప‌టిక‌ప్పుడు ఫ్రెష్ కాపీలు కొడుతూనే ఉంటారు. ఆ కాపీ స్వ‌రాలు గురించి నిత్యం ట్రోల్ జ‌రుగుతూనే ఉంటుంది. త‌న‌కు బాగా గుర్తింపు ద‌క్కిన సినిమా ద‌గ్గ‌ర నుంచి కాపీ అభియోగాలు లేకుండా థ‌మ‌న్ కెరీరే లేదు! 

ఇలాంటి క్ర‌మంలో బాల‌కృష్ణ తాజా సినిమా 'వీర‌సింహారెడ్డి'కి సంబంధించిన * జై బాల‌య్య‌* సాంగ్ పై ట్రోల్ ఒక రేంజ్ లో ఉంది. ఆ పాట ట్యూన్ కాపీ సంగ‌త‌లా ఉంచితే.. దీని క‌వ‌ర్ సాంగ్ అంటూ థ‌మ‌న్ అవ‌తారం కూడా కామెడీగా మారింది. సీరియ‌స్ సాంగ్ ను ప‌ర‌మ సిల్లీగా మార్చేశాడు థ‌మ‌న్. ఆ పాట‌లో థ‌మ‌న్ వాల‌కాన్నీ చూస్తే న‌వ్వు ఆగ‌మ‌న్నా ఆగ‌దు! దీంతో ట్రోల్ చేసే వాళ్ల‌కు మంచి అవ‌కాశం ల‌భించింది. 

చిరంజీవి, బాల‌కృష్ణ సినిమాల సంగ‌తెలా ఉన్నా.. వారివురి సినిమాల‌కు సంబంధించిన సాంగ్స్ మాత్రం వాటి మ్యూజిక్ డైరెక్ట‌ర్ల పుణ్య‌మా అని ఒక రేంజ్ లో న‌వ్వుల పాల‌వుతున్నాయి!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?