హాస్పిటల్ నుంచి రవితేజ డిశ్చార్జ్

గాయమైందని తెలిసి కూడా షూటింగ్ లో పాల్గొన్నాడు. దీంతో ఆ గాయం మరింత పెద్దదైంది. ఫలితంగా హాస్పిటల్ లో జాయిన్ అవ్వాల్సి వచ్చింది. సర్జరీ వరకు వెళ్లింది వ్యవహారం. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్…

గాయమైందని తెలిసి కూడా షూటింగ్ లో పాల్గొన్నాడు. దీంతో ఆ గాయం మరింత పెద్దదైంది. ఫలితంగా హాస్పిటల్ లో జాయిన్ అవ్వాల్సి వచ్చింది. సర్జరీ వరకు వెళ్లింది వ్యవహారం. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో రవితేజకు సర్జరీ నిర్వహించారు. ఈరోజు ఉదయం అతడు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడు.

“సర్జరీ సాఫీగా, విజయవంతంగా జరిగింది. ప్రస్తుతం నేను బాగున్నాను. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాను. మీ అందరికి థ్యాంక్స్. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.” ఇలా ఆపరేషన్ సక్సెస్ అయిన విషయాన్ని ప్రకటించాడు రవితేజ.

భాను భోగవరపు దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు రవితేజ. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్. కెరీర్ లో రవితేజకు ఇది ప్రతిష్టాత్మక 75వ చిత్రం.

మిస్టర్ బచ్చన్ షూటింగ్ పూర్తయిన వెంటనే, ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లాడు రవితేజ. ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా సినిమాను పూర్తిచేయాలని అనుకున్నాడు. అంతలోనే చేతికి గాయం అవ్వడం, అది మరింత ప్రమాదకరంగా మారి, సర్జరీకి దారితీయడం చకచకా జరిగిపోయాయి. వైద్యులు అతడికి 6 వారాల విశ్రాంతి సూచించారు.

7 Replies to “హాస్పిటల్ నుంచి రవితేజ డిశ్చార్జ్”

  1. బచ్చన్ పాటలో వెనక జేబిలో చేయ్యిట్టి స్టెప్ వద్దంటే విన్నావు కాదు, పుటుక్కున విరిగిపొండబ్బి ఇక నుంచయినా సెయ్యి ఏడ బడితె ఎట్టామాకయ్య

Comments are closed.