ఆగ్రాలో అడల్ట్ సీన్స్.. గర్వంగా ఉందన్న హీరోయిన్

ఊహించని విధంగా ఆగ్రా అనే సినిమా సోషల్ మీడియాలో హాట్ డిస్కషన్ గా మారిన సంగతి తెలిసిందే. దీనికి కారణం ఇందులో హీరోయిన్ రుహానీ శర్మ చేసిన అడల్ట్ సీన్స్. సినిమా ఇంకా రిలీజ్…

ఊహించని విధంగా ఆగ్రా అనే సినిమా సోషల్ మీడియాలో హాట్ డిస్కషన్ గా మారిన సంగతి తెలిసిందే. దీనికి కారణం ఇందులో హీరోయిన్ రుహానీ శర్మ చేసిన అడల్ట్ సీన్స్. సినిమా ఇంకా రిలీజ్ అవ్వకముందే, ఈ శృంగార సన్నివేశాలు లీక్ అయ్యాయి.

దీనిపై సోషల్ మీడియాలో చాలా పెద్ద చర్చ నడుస్తోంది. ఇలాంటి సన్నివేశాలు హిందూ సమాజానికి మంచిది కాదని కొంతమంది వాదిస్తున్నారు. మరికొంతమంది నేరుగా రుహానిపై విమర్శలకు దిగారు. ఈ మొత్తం వ్యవహారంపై రుహానీ స్పందించింది.

“నా ఎంపికపై నేను నిలబడి ఉన్నాను. నా సినిమాను, టీమ్ ను చూసి గర్విస్తున్నాను. ఇలాంటి ఫిల్మింగ్ స్టయిల్ ను అర్థం చేసుకోలేని వాళ్లను, ప్రశంశించలేకపోతున్న వాళ్లను నేను కోరేది ఒకటే. కనీసం మాకు, మా సినిమాకు గౌరవం ఇవ్వండి, మ కష్టాన్ని గుర్తించండి. ప్రజల్ని ఆలోచింపజేసేలా సినిమా తీయడం అంత ఈజీ కాదు, అదేమంత సౌకర్యవంతంగా కూడా ఉండదు. అది చాలా సవాళ్లతో కూడుకొని ఉంటుంది. ఈ విషయాన్ని అంతా గుర్తించాలి.”

సినిమాలో కేవలం అడల్ట్ సీన్స్ మాత్రమే చూస్తున్నారని.. తమ శ్రమను గుర్తించాలని కోరుతోంది రుహానీ. అంతర్జాతీయ అవార్డులు పొందిన ఈ సినిమాను మెచ్చుకోకపోయినా, తమ కష్టాన్ని గుర్తించాలని కోరుతోంది.

“మేం ఈ సినిమా కోసం రక్తం, చెమట, కన్నీళ్లు ధారపోసి ఈ ప్రాజెక్ట్ కు జీవం పోశాం. ఇలాంటి సినిమాపై మరో ఆలోచన లేకుండా చిటికెలో విమర్శలు చేస్తున్నారు. ఇది నన్ను మరింత బాధిస్తోంది. ఆగ్రా అనేది సాధారణమైన సినిమా కాదు. కాన్స్ చిత్రోత్సవంలో ప్రదర్శించారు. ఎన్నో అంతర్జాతీయ అవార్డులు కూడా అందుకుంది. సరిహద్దుల్ని చెరిపేసిన ఇలాంటి సినిమాపై ఇష్టమొచ్చినట్టు విమర్శలు చేస్తున్నారు.”

నిజానికి ఈ లీక్ అయిన వీడియోల ముసుగులో కొన్ని డీప్ ఫేక్ వీడియోలు కూడా హల్ చల్ చేశాయి. రుహానీ శర్మ ముఖాన్ని మార్ఫింగ్ చేసి, కొన్ని అశ్లీల వీడియోల్ని కూడా కొంతమంది సర్కులేట్ చేశారు. వీటిపై కొన్ని రోజుల కిందట సీరియస్ అయింది రుహానీ. చర్యలు తీసుకుంటానంటూ హెచ్చరించింది.

8 Replies to “ఆగ్రాలో అడల్ట్ సీన్స్.. గర్వంగా ఉందన్న హీరోయిన్”

  1. రక్త౦ , చెమట , కన్నీరు తో జీవం కుదరదు. విక్కీ డోనార్ కావాలి రుహాణి(ని) గారు. By the way మీ పేరులో ఉర్దూకి

    తెలుగుతో జీవం కూడా పోస గమనించారు?😉

  2. రక్త౦ , చెమట , కన్నీరు తో జీవం కుదరదు. విక్కీ డోనార్ కావాలి రుహాణి(ని) గారు. మీ పేరులో ఉర్దూకి తెలుగుతో జీవం కూడా పోస గమనించారు?

  3. violence and vulgarity choopinchakunda kooda emotions teppinchadame goppa direction and action. People like that become spielbergs others just join the big list of no names.

Comments are closed.