జ‌గ‌న్‌పై విరుచుకుప‌డ్డారు!

అచ్యుతాపురం దుర్ఘ‌ట‌న‌లో బాధితుల‌కు చంద్ర‌బాబు ప్ర‌భుత్వం స‌రైన రీతిలో అండ‌గా నిల‌వ‌లేద‌ని మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి విమ‌ర్శించ‌డం టీడీపీకి మంట పుట్టించింది. అస‌లు అచ్యుతాపురం ఘ‌ట‌న‌లో ఎంత మంది చ‌నిపోయారు? ఎంత మందికి…

అచ్యుతాపురం దుర్ఘ‌ట‌న‌లో బాధితుల‌కు చంద్ర‌బాబు ప్ర‌భుత్వం స‌రైన రీతిలో అండ‌గా నిల‌వ‌లేద‌ని మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి విమ‌ర్శించ‌డం టీడీపీకి మంట పుట్టించింది. అస‌లు అచ్యుతాపురం ఘ‌ట‌న‌లో ఎంత మంది చ‌నిపోయారు? ఎంత మందికి తీవ్ర గాయాల‌య్యాయో కార్మిక‌శాఖ మంత్రికి తెలియ‌ద‌ని జ‌గ‌న్ విమ‌ర్శించిన సంగ‌తి తెలిసిందే. దీంతో జ‌గ‌న్‌పై కార్మిక శాఖ మంత్రి, అలాగే టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు విరుచుకుప‌డ్డారు.

కార్మిక‌శాఖ మంత్రి సుభాష్ మీడియాతో మాట్లాడుతూ కార్మికుల ప్రాణాల‌పై జ‌గ‌న్ ఏ మాత్రం బాధ్య‌త లేకుండా వ్య‌వ‌హ‌రించార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. గ‌తంలో వైసీపీ హ‌యాంలో ప్ర‌మాదాల్లో కార్మికులు ప్రాణాలు కోల్పోతే ఏనాడూ సీఎం హోదాలో వైఎస్ జ‌గ‌న్ వెంట‌నే ప‌రామ‌ర్శ‌కు వెళ్ల‌లేద‌ని ఆరోపించారు. భ‌వ‌న నిర్మాణ కార్మికుల‌ను జ‌గ‌న్ వేధించార‌న్నారు. కార్మికుల బాగోగుల‌ను ప‌ట్టించుకోని జ‌గ‌న్, ఇప్పుడు వారి సంక్షేమం గురించి మాట్లాడ్డం హాస్యాస్ప‌ద‌మ‌ని కార్మిక శాఖ మంత్రి విమ‌ర్శించారు.

టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు ప‌ల్లా శ్రీ‌నివాస్ మీడియాతో మాట్లాడుతూ అచ్యుతాపురం ఘ‌ట‌న‌లో మంత్రులు సంఘ‌ట‌న స్థ‌లానికి వెళ్ల‌లేద‌ని జ‌గ‌న్ విమ‌ర్శించ‌డం విడ్డూరంగా వుంద‌న్నారు. ప్ర‌భుత్వ తీరు బాగాలేద‌ని విమ‌ర్శించ‌డం చూస్తే జ‌గ‌న్ మాన‌సిక స్థితి అర్థ‌మ‌వుతోంద‌న్నారు. వైపీపీ హ‌యాంలో సేఫ్టీ ఆడిట్ జరగలేదని, అదే ప్ర‌మాదానికి దారి తీసింద‌ని ఆయ‌న విమ‌ర్శించారు. జగన్‌ శవ రాజకీయాలు మానుకోవాలని ప‌ల్లా హితవు పలికారు.

ఆస్ప‌త్రిలో బాధితులతో జ‌గ‌న్ నవ్వుతూ మాట్లాడడం విచిత్రంగా ఉందని ప‌ల్లా అన్నారు. ఇప్పటికైనా బాధిత కుటుంబాలకు జ‌గ‌న్‌ రక్షణగా ఉండాలన్నారు. బాధ్యత కలిగిన ప్రతిపక్ష నేతగా వ్య‌వ‌హ‌రించాల‌ని ఆయ‌న అన్నారు.

19 Replies to “జ‌గ‌న్‌పై విరుచుకుప‌డ్డారు!”

    1. అది వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు గాడి దిగంబర ప్రదర్శన..

      watch at your own risk.. please..

      1. అంత గట్టిగ వార్నింగ్ ఇచ్చాక కూడా ఎందుకు లెండి సర్ రిస్క్ చెయ్యడం

  1. సరే కానీ నిన్న అన్న బాధితులను పరామర్శ చేసినప్పుడు రెడ్ కార్పెట్ వేసారా ??!! చుట్టూ పరదాలు కట్టించారా ??? పోనీ రోడ్ లు ఐన బ్లాక్ చేసారా ??? కనీసం అక్కడ పోగు ఐన జనాలు బాదితుల ల్లో ఉన్న ఆడ కూతుళ్ళ మీద లోంచి నల్ల చున్నీలు తీయించారా ????చెట్లు కొట్టించారా అలానే బారికేడ్లు పెట్టించారా ????

  2. అన్న బతుకు అక్క బయట పెట్టింది కదా మీరు రాయలేదు, మరి అసలు డిసెంబర్ లో నే తెలిసింది అంట కదా సేఫ్టీ మెజార్స్ ఫాలో అవ్వని కంపెనీ ల్లో ఇప్పుడు ఘటన జరిగిన కంపెనీ కూడా ఒకటి అని…..మరి అప్పుడు గాజులు ఎక్కించుకున్నారా ????

  3. ఏమిటో అన్న పర్యటన లో కర్ఫ్యూ లేదు రెడ్ కార్పెట్ లేదు చున్నీ లు తీయించడాలు లేవు చెట్లు నరకడాలు లేవు…..పరదాలు లేవు….ఇలా ఐతే ఎలా అన్న ప్రతిపక్షం లో ఉంటేనే మేలు అని జనాలు అనుకుంటే ఎంత కష్టం

  4. Jagan’s allegation seems funny. How TDP leaders go and rescue the people, it is fire department and they did their best. It is sheer negligence of management that caused this mishap. This is the failure of Jagan, he fail to address the facts always, and want to live in fake bubble. He did that in last 5 years.

Comments are closed.