రవితేజ హీరోగా సైన్స్ ఫిక్షన్ సినిమా

టాలీవుడ్ లో మెల్లమెల్లగా సైన్స్-ఫిక్షన్ సినిమాల ట్రెండ్ ఊపందుకుంటున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే 2 సినిమాలు రిలీజయ్యాయి. కల్కి సినిమా సెట్స్ పై ఉంది. ఇప్పుడీ లిస్ట్ లోకి రవితేజ కూడా చేరాడు. Advertisement వచ్చే…

టాలీవుడ్ లో మెల్లమెల్లగా సైన్స్-ఫిక్షన్ సినిమాల ట్రెండ్ ఊపందుకుంటున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే 2 సినిమాలు రిలీజయ్యాయి. కల్కి సినిమా సెట్స్ పై ఉంది. ఇప్పుడీ లిస్ట్ లోకి రవితేజ కూడా చేరాడు.

వచ్చే ఏడాది ఓ సైన్స్ ఫిక్షన్ సినిమాను స్టార్ట్ చేయబోతున్నట్టు ప్రకటించాడు రవితేజ. టైగర్ నాగేశ్వరరావు మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడిన ఈ హీరో.. ఇకపై డిఫరెంట్ జానర్స్ ప్రయత్నిస్తానని, అందులో భాగంగా సైన్స్ ఫిక్షన్ మూవీ కూడా చేస్తానని క్లారిటీ ఇచ్చాడు. అయితే ఆ మూవీ డీటెయిల్స్ వెల్లడించడానికి నిరాకరించాడు.

మాస్-యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు రవితేజ. చాన్నాళ్ల పాటు రొటీన్ సినిమాలే చేశాడు. మధ్యలో రాజా ది గ్రేట్ లాంటి సినిమాలు పడ్డాయి. అయితే ఇకపై తన నుంచి వచ్చే ప్రతి సినిమా కొత్త జానర్ టచ్ చేస్తుందని తెలిపాడు ఈ సీనియర్ హీరో.

ప్రస్తుతం ఈగిల్ సినిమా చేస్తున్నాడు. ఇది స్పై థ్రిల్లర్. ఈ సినిమా తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. అది యదార్థ ఘటనల ఆధారంగా వస్తోంది. వీటితో పాటు లిస్ట్ లో సైన్స్ ఫిక్షన్ సినిమా, ఓ ఫుల్ లెంగ్త్ కామెడీ మూవీ కూడా ఉన్నట్టు స్పష్టం చేశాడు.

ఈ క్రమంలో యంగ్ డైరక్టర్స్ తో వర్క్ చేస్తానని కూడా ప్రకటించాడు. ఓవైపు కొత్త దర్శకులతో సినిమాలు చేస్తూనే, మరోవైపు రాజమౌళి లాంటి దర్శకులతో మరోసారి కలిసి పనిచేయాలని ఉందంటూ తన మనసులో మాట బయటపెట్టాడు రవితేజ. ఏడాదికి మినిమం 3 సినిమాలు చేసే ఈ హీరో, ఏడాది తిరిగేలోగా సైన్స్ ఫిక్షన్ సినిమాను విడుదల చేసే ఛాన్స్ ఉంది.