రవితేజ 15 నిమిషాల్లో ఓకే చెప్పిన సినిమా

ఖిలాడీ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ మేటర్ బయటపెట్టాడు దర్శకుడు రమేష్ వర్మ. ఖిలాడీ సినిమాకు రవితేజ కేవలం 15 నిమిషాల్లో ఓకే చెప్పారని అన్నాడు. నిజానికి అంతా ఈ సినిమాకు రీమేక్ అనుకుంటున్నారని, కానీ…

ఖిలాడీ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ మేటర్ బయటపెట్టాడు దర్శకుడు రమేష్ వర్మ. ఖిలాడీ సినిమాకు రవితేజ కేవలం 15 నిమిషాల్లో ఓకే చెప్పారని అన్నాడు. నిజానికి అంతా ఈ సినిమాకు రీమేక్ అనుకుంటున్నారని, కానీ ఖిలాడీ అనేది స్ట్రయిట్ సబ్జెక్ట్ అనే విషయాన్ని బయటపెట్టాడు రమేష్ వర్మ.

“రాక్షసుడు హిట్టవ్వడంతో రవితేజ మరోసారి అవకాశం ఇచ్చారు. రీమేక్ సబ్జెక్ట్ ఏదైనా ఉంటే చూడమన్నారు. తమిళ్ లో వచ్చిన చతురంగ వేట్టై-2 సినిమా చూపించాం. అది తన ఇమేజ్ కు సరిపోదన్నారు రవితేజ. అదే టైమ్ లో మనీ కాన్సెప్ట్ తో నా దగ్గరున్న ఓ స్టోరీని వినిపించాను. దాన్ని పూర్తిస్థాయిలో డెవలప్ చేయమన్నారు. నెల రోజులు తర్వాత పూర్తిగా నెరేషన్ ఇస్తే 15 నిమిషాల్లో సినిమాకు ఓకే చెప్పారు.”

తమిళ సినిమా ఇంటర్వెల్ కు, ఖిలాడీ సినిమా ఇంటర్వెల్ సీన్ కు చిన్న సారూప్యం ఉంటుందని ఒప్పుకున్నాడు రమేష్ వర్మ. అయినప్పటికీ తమిళ సినిమా రీమేక్ రైట్స్ తమ వద్దే ఉన్నాయి కాబట్టి, ఎలాంటి లీగర్ ఇష్యూస్ ఉండవంటున్నాడు. త్వరలోనే చతురంగ వేట్టై-2 సినిమా కూడా తెలుగులో రీమేక్ అవుతుందంటున్నాడు ఈ దర్శకుడు.

నిజానికి రమేష్ వర్మకు లవ్ స్టోరీస్ తీయడం ఇష్టమంట. ఆల్రెడీ 2 ప్రేమకథలు సిద్ధం చేసి పెట్టుకున్నాడట. అయినప్పటికీ తనకు కమర్షియల్ కథలే ఎక్కువగా పడుతున్నాయంటున్నాడు ఈ డైరక్టర్.