పవన్ తో సినిమానా.. అలాంటిదేం లేదు

టాలీవుడ్ లో ప్రతి హీరోపై పుకార్లు వస్తుంటాయి. కొన్ని కాంబినేషన్లపై ఎప్పటికప్పుడు పుకార్లు వినిపిస్తుంటాయి. అయితే వాటిపై హీరోలు పెద్దగా రెస్పాండ్ అవ్వరు, లైట్ తీసుకుంటారు. రవితేజ-పవన్ కల్యాణ్ కాంబినేషన్ పై వచ్చిన పుకారు…

టాలీవుడ్ లో ప్రతి హీరోపై పుకార్లు వస్తుంటాయి. కొన్ని కాంబినేషన్లపై ఎప్పటికప్పుడు పుకార్లు వినిపిస్తుంటాయి. అయితే వాటిపై హీరోలు పెద్దగా రెస్పాండ్ అవ్వరు, లైట్ తీసుకుంటారు. రవితేజ-పవన్ కల్యాణ్ కాంబినేషన్ పై వచ్చిన పుకారు కూడా అలాంటిదే.

మలయాళంలో సూపర్ హిట్టయిన డ్రైవింగ్ లైసెన్స్ సినిమాను రవితేజ, పవన్ కల్యాణ్ కలిసి రీమేక్ చేస్తారనే ప్రచారం చాన్నాళ్లుగా నడుస్తోంది. ఇప్పుడీ రూమర్ పై స్వయంగా రవితేజ స్పందించాడు.

పవన్ కల్యాణ్ తో కలిసి సినిమా చేసే ప్లాన్ ప్రస్తుతానికి లేదన్నాడు రవితేజ. అది పుకారు అని, ఆ రూమర్ తన వరకు కూడా వచ్చిందని అన్నాడు. అయితే అలాంటి కథ దొరికితే మాత్రం పవన్ కల్యాణ్ తో నటించే అవకాశం వదులుకోనని కూడా స్పష్టం చేశాడు.

టైగర్ నాగేశ్వరరావు సినిమా ప్రచారంలో భాగంగా ఇలా పవన్ కల్యాణ్ తో మల్టీస్టారర్ అంటూ జరుగుతున్న ప్రచారంపై స్పందించాడు రవితేజ. ఇక ప్రస్తుతం నడుస్తున్న సీక్వెల్స్ ట్రెండ్ పై కూడా స్పందించాడు రవితేజ

టైగర్ నాగేశ్వరరావు సినిమాకు పార్ట్-2 వస్తుందా రాదా అనేది అప్పుడే చెప్పలేనని, అయితే తన సినిమాల విషయానికొస్తే, క్రాక్ సినిమాకు పార్ట్-2 తీయాలని ఉందంటూ మనసులో మాట బయటపెట్టాడు. దానికి సంబంధించి దర్శకుడితో చిన్నపాటి చర్చ కూడా జరిగినట్టు వెల్లడించాడు.