ఆర్ఆర్ఆర్ ‘స్కాట్’ దొర మృతి!

ఆస్కార్‌ అవార్డు అందుకున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాలో ‘స్కాట్’ దొరగా అందరికీ సుపరిచితుడైన హాలీవుడ్ సీనియర్ నటుడు రే స్టీవెన్‌సన్ (58) హఠాన్మరణం చెందారు. ఆర్ఆర్ఆర్ లో బ్రిటిష్ ఎంపరర్ స్కాట్ గా నటించి.. ఆయ‌న‌…

ఆస్కార్‌ అవార్డు అందుకున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాలో ‘స్కాట్’ దొరగా అందరికీ సుపరిచితుడైన హాలీవుడ్ సీనియర్ నటుడు రే స్టీవెన్‌సన్ (58) హఠాన్మరణం చెందారు. ఆర్ఆర్ఆర్ లో బ్రిటిష్ ఎంపరర్ స్కాట్ గా నటించి.. ఆయ‌న‌ నటనతో ప్రేక్షకులను మెప్పించారు. ఆయన మృతికి అసలు కారణాలు మాత్రం వెల్లడి కాలేదు. 

1964లో నార్త్‌ ఐర్లాండ్‌లోని లిస్‌బర్న్‌లో స్టీవెన్సన్ జన్మించారు. 8 ఏళ్ల‌ వయస్సులో ఇంగ్లండ్‌ చేరుకున్న ఆయన బ్రిస్టల్ ఓల్డ్‌ విక్‌ థియేటర్‌ స్కూల్‌లో ప్రవేశం పొందాడు. 29 ఏండ్లకు గ్రాడ్యుయేట్‌ అయిన ఆయన 1990ల్లో టీవీ షోల్లో నటించడం మొదలు పెట్టారు. 

కొన్నేండ్లపాటు బ్రిటిష్ టెలివిజన్‌లో పనిచేసిన స్టీవెన్సన్‌.. 25 ఏళ్ల వయసులోనే వెండితెరకు పరిచయం అయ్యారు. కింగ్ ఆర్థర్ (2004), ది అదర్ గైస్ (2010), థోర్ (2011), ది ట్రాన్స్‌పోర్టర్: రీఫ్యూయెల్డ్ (2015), యాక్సిడెంట్ మ్యాన్ (2018) లాంటి సినిమాల్లో నటించి మెప్పించారు.