రీరైటింగ్…ఛత్రపతి

బాహుబలి ప్రభాస్ కెరీర్ లో ఓ టర్నింగ్ పాయింట్ ఛత్రపతి. ఆ సినిమాతో ఇప్పుడు బాలీవుడ్ లో తన లక్ పరీక్షించుకోవాలని అనుకుంటున్నాడు బెల్లంకొండ సాయి. యాక్షన్, సెంటిమెంట్, ఎమోషన్ లు కీలకంగా వుండే…

బాహుబలి ప్రభాస్ కెరీర్ లో ఓ టర్నింగ్ పాయింట్ ఛత్రపతి. ఆ సినిమాతో ఇప్పుడు బాలీవుడ్ లో తన లక్ పరీక్షించుకోవాలని అనుకుంటున్నాడు బెల్లంకొండ సాయి. యాక్షన్, సెంటిమెంట్, ఎమోషన్ లు కీలకంగా వుండే ఈ సినిమానే తన బాలీవుడ్ ఎంట్రీకి సరైనది అని ఫిక్స్ అయ్యాడు.

బాలీవుడ్ డబ్బింగ్ సినిమాల్లో సాయి శ్రీనివాస్ సినిమాలకు ఓ మార్కెట్ అంటూ వుంది. ఇప్పుడు ఆ మార్కెట్ అండతోనే ఛత్రపతి రీమేక్ దిశగా అడుగులు వేస్తున్నాడు.

అయితే ఎంత మంచి సినిమాగా పేరు తెచ్చుకున్నా ఛత్రపతికి కూడా చిన్న చిన్న మైనస్ లు వున్నాయన్న పాయింట్లు వున్నాయి. అలాగే కాలం మారుతోంది. దానికి అనుగుణంగా ఛేంజెస్ చేయాలి. అయితే ఎవరో ఒకరు అలా చేసి, తమ మైండ్ సెట్ ప్రకారం మార్చేసి, దాన్ని పాడు చేస్తే, మళ్లీ అదో సమస్య.

అందుకే ఛత్రపతి కథ రచయితకే ఆ బాధ్యతలు అప్పగిస్తే. అదే పని చేసారు ఇప్పుడు. ఛత్రపతి కథ రాసిన విజయేంద్ర ప్రసాద్ చేతిలోనే ఈ మార్పులు చేర్పుల బాధ్యత పెట్టారు. ఈ జనరేషన్ కు అనుగుణంగా, బాలీవుడ్ ప్రేక్షకుల టేస్ట్ కు తగినట్లు చిన్న చిన్న మార్పులు చేసే పనిని విజయేంద్ర ప్రసాద్ స్టార్ట్ చేసారు.

అయితే ఇప్పుడు కీలకమైనది ఆ సినిమాకు ఓ డైరక్టర్ కావాలి.అది కూడా సౌత్ సబ్జెక్ట్ పల్స్ తెలిసిన వారు. అందుకే ఆ వేట కొనసాగుతోంది.

బుద్ది లేని రాతలు