అమ్మమ్మ పాత్ర కూడా చేస్తానంటున్న హాట్ లేడీ

అనసూయ.. ఈమెపై ఆడియన్స్ కు ఓ రకమైన ఇంప్రెషన్ ఉంది. మరీ ముఖ్యంగా సిల్వర్ స్క్రీన్ విషయానికొస్తే, అనసూయ చేసే పాత్రలపై ఓ ఐడియా ఉంది. అయితే అనసూయ మాత్రం అలాంటి ఐడియాలు, అంచనాల్ని…

అనసూయ.. ఈమెపై ఆడియన్స్ కు ఓ రకమైన ఇంప్రెషన్ ఉంది. మరీ ముఖ్యంగా సిల్వర్ స్క్రీన్ విషయానికొస్తే, అనసూయ చేసే పాత్రలపై ఓ ఐడియా ఉంది. అయితే అనసూయ మాత్రం అలాంటి ఐడియాలు, అంచనాల్ని పట్టించుకోవడం లేదు. కథ డిమాండ్ చేస్తే అమ్మమ్మగా కనిపించడానికి కూడా రెడీ అంటూ ప్రకటించింది.

“సిల్వర్ స్క్రీన్ వరకు నాకు అన్ని రకాల పాత్రలు చేయాలని ఉంది. కథ డిమాండ్ చేస్తే అమ్మమ్మ పాత్ర కూడా చేస్తాను. అయితే ఆ పాత్ర చూసిన తర్వాత అమ్మమ్మ గురించి మాట్లాడుకునేలా ఉండాలి.”

ఇలా పాత్రల ఎంపికలో తన మైండ్ సెట్ ను బయటపెట్టింది అనసూయ. పెదకాపు-1 సినిమాలో ఓ కీలకమైన పాత్ర పోషించింది ఈ ముద్దుగుమ్మ, ఆ పాత్ర కోసం తను చాలా మేకోవర్ అయ్యానని, రంగస్థలం తర్వాత అంత పేరు తెచ్చిపెడుతుందని చెబుతోంది.

“రంగస్థలంలో రంగమ్మత్తగా నన్ను ఎక్కువగా గుర్తుపెట్టుకుంటారు. ఆ పాత్ర ఒక బార్ ని సెట్ చేసింది. అయితే నేను మాత్రం విభిన్నమైన పాత్రలు చేయడానికి నా వంతుగా ప్రయత్నిస్తున్నాను. విమానం సినిమాలో సుమతి పాత్రలో విభిన్నంగా కనిపించాను. ఇప్పుడు పెదకాపులో చేసిన పాత్ర కూడా చాలా బలంగా, వైవిధ్యంగా ఉంటుంది.”

కథ, క్యారెక్టరైజేషన్ కు తగ్గట్టు పెదకాపు-1 సినిమాలో తను కొన్ని బోల్డ్ డైలాగ్స్ కూడా చెప్పినట్టు వెల్లడించింది అనసూయ. పెదకాపు సినిమాలో ప్రతి పాత్రకు ఓ మేకోవర్ ఉందని అంటోంది. శ్రీకాంత్ అడ్డాల డైరక్ట్ చేసిన ఈ సినిమా 29న థియేటర్లలోకి వస్తోంది.