cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie News

బిత్తిరి సత్తి ఔట్.. అసలు కారణం ఇది

బిత్తిరి సత్తి ఔట్.. అసలు కారణం ఇది

బిత్తిరి సత్తి అలియాస్ చేవెళ్ల రవి టీవీ9కు రాజీనామా సమర్పించారు. ఆయనకు ఛానెల్ కు ఇప్పుడు సంబంధం లేదు. అయితే సత్తి ఎందుకు ఛానెల్ నుంచి బయటకొచ్చాడనే చర్చ మాత్రం ఇంకా జోరుగా సాగుతోంది. బిగ్ బాస్ లో పాల్గొనేందుకే బిత్తిరి సత్తి, టీవీ9 నుంచి వైదొలిగాడనేది చాలామంది చెబుతున్న లాజిక్. కానీ అసలు మేటర్ అది కాదు.

టీవీ9లో చాన్నాళ్లుగా బిత్తిరి సత్తి మెడపై కత్తి వేలాడుతోంది. అతడు చేస్తున్న ఇస్మార్ట్ న్యూస్ కార్యక్రమం టీఆర్పీ పరంగా పెద్దగా ఆడలేదు. మరీ ముఖ్యంగా గతంలో వీ6 ఛానెల్ లో బిత్తిరి సత్తి చేసిన కార్యక్రమంతో పోల్చి చూసుకుంటే కంటెంట్ పరంగా, రేటింగ్ పరంగా ఇస్మార్ట్ న్యూస్ తేలిపోయింది.

అప్పట్నుంచే బిత్తిరి సత్తిపై మేనేజ్ మెంట్ దృష్టిపెట్టింది. ఎందుకంటే ఇతడికి ఇస్తున్న ప్యాకేజీ సామాన్యమైన ప్యాకేజీ కాదు. ఛానెల్ లో ఎగ్జిక్యూటివ్ బోర్డ్ లో ఉండే వ్యక్తులు నెలవారీ తీసుకునే గౌరవ వేతనానికి బిత్తిరి సత్తి రెమ్యూనరేషన్ ఏమాత్రం తీసిపోదు. ఇంత పే చేస్తున్నా రేటింగ్ రాకపోయేసరికి మేనేజ్ మెంట్ అసంతృప్తితో ఉంది. దీనికితోడు తాజాగా సత్తి చేసిన ఓ పని, అతడి ఉద్యోగానికి ఎసరు పెట్టిందని చెబుతున్నారు.

ఫాదర్స్ డే సందర్భంగా టీవీ9లో ఓ కార్యక్రమం చేశాడు సత్తి. అందులో తన తండ్రిని పొగుడుతూ సుదీర్ఘంగా ఏదేదో చెప్పుకొచ్చాడట. ఆ ఎపిసోడ్ అలానే టెలికాస్ట్ అయింది. ముందుగా క్రాస్ చెక్ చేసుకోని మేనేజ్ మెంట్ లైవ్ లో ఆ ప్రహసనం చూసి కంగుతింది. ఆ వెంటనే జరిగిన పరిణామాలతో బిత్తిరి సత్తి ఛానెల్ ను వీడాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆ ఎపిసోడ్ ను తమ యూట్యూబ్ ఛానెల్ నుంచి కూడా యాజమాన్యం తొలిగించింది.

ఇదీ సింపుల్ గా బిత్తిరి సత్తి రాజీనామా వెనక జరిగిన తంతు. ఆయనతో పాటు అదే కార్యక్రమానికి పనిచేసే మరో వ్యక్తి కూడా ఈ ఎపిసోడ్ లో తన ఉద్యోగం పోగొట్టుకోవాల్సి వచ్చింది. అంతా బాగానే ఉంది కానీ సత్తికి సూపర్ హిట్ జోడీగా కొనసాగుతున్న శివజ్యోతి ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

ముఠా నాయకుడు బైటకు రావాలి

'వైఎస్సార్‌ కాపు నేస్తం' ప్రారంభం