థమన్ ఇస్తున్న అవుట్ పుట్ చూస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్ సంగతి చూసేసారు. కొంత మంది దర్శకులకే వీళ్ల అవుట్ పుట్ సెట్ అవుతోంది. మిగిలిన వారికి సెట్ కావడం లేదు.
ఇప్పటికే నాని లాంటి హీరోలు వెదికి వెదికి సంగీత దర్శకులను తీసుకువస్తున్నారు. కాస్త ఇబ్బంది అయినా అనిరుధ్ ను ట్రయ్ చేస్తున్నారు. అనిరుధ్ ఫుల్ బిజీ. అంత సులువుగా వర్క్ కాదు. అయినా కూడా తప్పక అటే వెళ్తున్నారు. రెహమాన్ తెలుగులో డైరెక్ట్ సినిమా చేసి చాలా కాలం అయింది. బుచ్చిబాబు-రామ్ చరణ్ సినిమాకు తీసుకున్నారు.
ఇప్పుడు రెహమాన్ లేదా అనిరుధ్ లనే ట్రయ్ చేసే పనిలో పడ్డారు చాలా మంది దర్శకులు. హీరోలు కూడా థమన్, దేవీ కాకుండా పక్క భాషల నుంచి మంచి వెర్సటైల్ మ్యూజిక్ డైరక్టర్ లను తెమ్మని అడుగుతున్నారు.
లేటెస్ట్ గా చైతన్య-చందు మొండేటి సినిమాకు ఎవరు మ్యూజిక్ డైరక్టర్ అన్న డిస్కషన్ జరుగుతోంది. రెహమాన్ లేదా అనిరుధ్ అయితే బెటర్ అని టీమ్ లోని కీలక మెంబర్లంతా అభిప్రాయ పడినట్లు తెలుస్తోంది. ఈ రెండు పేర్లేనా, మరో చాయిస్ ఏమయినా వుందా అని డిస్కషన్లు సాగిస్తున్నారు. ఈ రెండు పేర్లలో ఒకటి ఫైనల్ కావచ్చు.