Advertisement

Advertisement


Home > Movies - Movie News

రెండు సినిమాలు సేఫ్

రెండు సినిమాలు సేఫ్

దసరా సీజన్ సందర్భంగా మూడు సినిమాలు పోటా పోటీగా విడుదలవుతున్నాయి. మెగాస్టార్ గాడ్ ఫాదర్, నాగార్జున ఘోస్ట్, కొత్త హీరో గణేష్ ‘స్వాతిముత్యం’. మొదటి సినిమా భారీ బడ్జెట్. రెండో సినిమా మీడియం బడ్జెట్. మూడో సినిమా కంఫర్టబుల్ బడ్జెట్. విడుదల విషయంలో మూడూ గట్టిగా పోటీ పడుతున్నా, రిస్క్ అన్నది మెగాస్టార్ సినిమాకే ఎక్కువ వుంది. 

ఈ సినిమాను కాస్త భారీ బడ్జెట్ తోనే తయారు చేసారు. ఆ రేంజ్ లో మార్కెట్ చేసారు. కానీ చాలా మార్కెట్ అడ్వాన్స్ ల మీదే జరిగింది. అందువల్ల తీసుకున్న అడ్వాన్స్ ల మేరకు సినిమా కలెక్షన్లు వుండాల్సి వుంది. దానిని బట్టే నిర్మాతలు సేఫ్ కావడం అన్నది వుంటుంది. ఆర్ బి చౌదరి, ఎన్వీ ప్రసాద్, రామ్ చరణ్ ముగ్గురు భాగస్వాములు ఈ సినిమాకు.

ఇక రెండో సినిమా నాగార్జున ఘోస్ట్. విడుదలకు ముందే సేఫ్ అయింది. నాన్ థియేటర్ ఖర్చులతో సినిమా తీసారు. ఆంధ్రలో నాలుగు ఏరియాలు నాగ్ కు రెమ్యూనిరేషన్ గా ఇచ్చేసారు. ఆంధ్రలో మిగిలిన ఏరియాలు, సీడెడ్ ఆదాయాన్ని పబ్లిసిటీ ఖర్చులకు వాడేసారు. నైజాం ఏరియా ఎంత వస్తే అది మగ్గురు నిర్మాతలు రామ్మోహనరావు, ఆసియన్ సునీల్, శరత్ మరార్ షేర్ చేసుకోవాలి.

మూడొ సినిమా స్వాతిముత్యం. ప్రొడక్షన్, వడ్డీలు, పబ్లిసిటీ అంతా కలిపి 11 కోట్లు అయింది. ఏడు కోట్లకు పైగా నాన్ థియేటర్ ఆదాయం వచ్చింది. ఆంధ్ర రెండు కోట్లకు పైగా, సీడెడ్ 80 లక్షలు, నైజాం కోటిన్నరకు మార్కెట్ చేసారు. ఓవర్ సీస్ అడ్వాన్స్ మీద విడుదల చేస్తున్నారు. ఆ విధంగా విడుదలకు మందే సేఫ్ అయిపోయారు. ఓవర్ ఫ్లోస్ ఎంత వస్తే అదే లాభం.

మొత్తం మీద దసరా పండగ ఎవరికి పండగ అవుతుందో, ఎవరికి కాదో అన్నది హిట్ ను బట్టి ఆధారపడి వుంది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?