Advertisement

Advertisement


Home > Movies - Movie News

రెండు సంస్థల మధ్య ఓటీటీ చిచ్చు!

రెండు సంస్థల మధ్య ఓటీటీ చిచ్చు!

ఓటీటీ లేదా నాన్ థియేటర్ వ్యాపారం అన్నది గత రెండు మూడేళ్లు టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగింది. అడియో రైట్స్, డిజిటల్ రైట్స్, హిందీ రైట్స్, ఓటీటీ రైట్స్ ఇలా రకరకాలుగా ఆదాయం వచ్చి పడింది. దాంతో నిర్మాతలు ఇబ్బడి ముబ్బడిగా సినిమాలు తీయడం ప్రారంభించారు. దాంతో హీరోలు తమ చిత్తానికి పారితోషికాలు పెంచేసారు. నాన్ థియేటర్ బాగున్నంత వరకు ఇది బాగానే నడిచింది. కానీ ఎప్పుడైతే ఓటీటీ సంస్థలు మెర్జ్ కావడం అనే వ్యవహారం స్టార్ట్ అయిందో, ఓటీటీ అమ్మకాలు మందగించడం మొదలయిందో, సమస్యలు ఆరంభమయ్యాయి.

అంతకు ముందు ఫలానా హీరోకి పాతిక కోట్లు నాన్ థియేటర్ అనుకుంటే అది సగానికి సగం పడిపోయింది. కొన్ని సినిమాలకు కొనేవారే కరువయ్యారు. కొన్ని సినిమాలు నాన్ థియేటర్ అమ్మకాలు పూర్తి కాకుండానే విడుదల చేసుకోవాల్సి వస్తోంది. మొత్తం మీద ఇది ఓ కుదుపు. సినిమా నిర్మాతలు అందరూ నేరుగా అమెజాన్, నెట్ ఫ్లిక్స్ తో వ్యాపారాలు చేయరు. కొందరు లోకల్ ప్లేయర్ ల ద్వారా కూడా సినిమాల అమ్మకాలు సాగిస్తారు. ఇలాంటి బిజినెస్ లో లీడ్ లో వున్నది మాంగో సంస్థ. దాని అధినేత రామ్.

సినిమాల నాన్ థియేటర్ రైట్స్ విక్రయించడంలో ఈ సంస్థ రకరకాలుగా వ్యవహరిస్తూ వుంటుంది. సలహాలు ఇస్తుంది. డీల్ చేస్తుంది. పర్చేజ్ చేస్తుంది. ఇలా రకరకాలుగా వుంటుంది నిర్మాతలు, సినిమాలు లెక్కన. ఇప్పుడు ఆ సంస్థకు వరుసగా సినిమాలు చేస్తూ టాలీవుడ్ లో పెద్ద సంస్థగా మారుతున్న పీపుల్స్ మీడియాకు మధ్య ఓ కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చినట్లు తెలుస్తోంది.

చాలా కాలంగా ఈ రెండు సంస్థల నడుమ సినిమాల నాన్ థియేటర్ లావాదేవీలు వున్నాయి. అలాగే శర్వానంద్ సినిమాకు సంబంధించిన నాన్ థియేటర్ వ్యవహారం ఏదో వుంది. ఇప్పుడు దాని దగ్గర తేడా వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దాంతో పీపుల్స్ మీడియా నుంచి మ్యాంగో సంస్థకు నోటీస్ వెళ్లినట్లు ఇండస్ట్రీలో వినిపిస్తోంది.

ఈ విషయమై పీపుల్స్ మీడియా విశ్వప్రసాద్ ను అడగితే, సమయం వచ్చినపుడు ఈ విషయమై చెబుతానన్నారు. ఇప్పుడు ఇది మీడియాకు అంతగా అవసరం లేని సంగతి అనే విధంగా ఆయన అభిప్రాయపడ్డారు.

ఇదే విషయమై మ్యాంగో రామ్ ను ప్రశ్నించగా, చాలా మంది నిర్మాతలకు గ్రౌండ్ రియాల్టీ తెలియడం లేదని చెబుతూ, ఇండస్ట్రీ తీరు తెన్నులు వివరించారు. పీపుల్స్ మీడియాతో తన ఇస్యూ చాలా చిన్నదనే తను అనుకుంటున్నా అని, పెద్దది చేసుకుంటే తానేం చేయలేనని అన్నారు.

మొత్తం మీద చూస్తుంటే గతంలో మాదిరిగా ఫార్వార్డ్ ట్రేడింగ్ అన్నది ఇప్పుడు కాస్త కష్టమే. అమ్ముడైతే లాభం మనకు, లేదంటే కష్టం నిర్మాతకు అనే విధంగా వుంటోందీ వ్యాపారం అని నిర్మాతలు భావిస్తున్నారు. తప్పనిసరి అయిన వాళ్లు ఈ దోవలోకి వెళ్తున్నారు. కొంత మంది నేరుగా డీల్ చేసుకుంటున్నారు. కానీ మల్టీనేషనల్స్, కార్పొరేట్ కంపెనీలతో డీల్ కన్నా కూడా డాక్యుమెంటేషన్ అన్నది కీలకం. అవన్నీ పడలేని వారు ఇటు వస్తున్నారు. మొత్తం మీద నాన్ థియేటర్ వ్యవహారం కాస్త గడబిడగానే వుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?