జనసేనాని పవన్‌కల్యాణ్ వ్యక్తిగత జీవితాన్ని వైసీపీ పదేపదే తెరపైకి తేవడం ఆయన అభిమానుల్ని చికాకు పెడుతోంది. పవన్ కూడా చాలా ఇబ్బందికి గురి అవుతున్నారు. ఈ నేపథ్యంలో పవన్ మాజీ భార్య, నటి రేణూదేశాయ్ సోషల్ మీడియాలో ఒక వీడియోను విడుదల చేసింది. ఆమె వెల్లడించిన విషయాలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.
పవన్‌కల్యాణ్‌కు ఆమె మద్దతుగా మాట్లాడినట్టు, నిలిచినట్టు ఉన్నప్పటికీ, ఒకే ఒక్క విషయంలో జనసేన జీర్ణించుకోలేకపోతోంది. మరోవైపు ఆమెని నెటిజన్లు టార్గెట్ చేశారు. రేణూ దేశాయ్ మాటల్లోని ప్రధాన అంశాలేంటో తెలుసుకుందాం.
“డబ్బుపై పవన్‌కు ఆశలేదు. సమాజానికి మంచి చేయాలనే తపనతో రాజకీయాల్లోకి వచ్చాడు. రాజకీయంగా ఆయనకే నా మద్దతు. నా విషయంలో ఆయన వందశాతం తప్పు చేశారు. పవన్‌తో రాజకీయ, వృత్తిపరమైన విభేదాలుంటే మీరు మీరు చూసుకోవాలి. అంతే తప్ప వాటిలోకి మహిళల్ని, పిల్లల్ని లాగొద్దు” అని ఆమె అభ్యర్థించారు.
“ఔను రేణు మేడమ్ చెప్పింది నిజమే. పవన్‌కు డబ్బుపై ఆశలేదు…ఓన్లీ అమ్మాయిలపైన్నే” అంటూ నెటిజన్లు సెటైర్స్ విసిరారు. జీవితాంతం కలిసి నడుస్తామని, కష్టనష్టాలు, సుఖదుఃఖాల్లోనూ ఒకరికొకరం తోడుగా వుంటామని ఏడడుగులు నడిచే సమయంలో ప్రమాణాలు చేసుకోడాన్ని మరిచి, మరో మహిళ మోజులో పడి మోసగించిన వ్యక్తితో కలిసి జీవించలేని విడాకులు తీసుకున్న రేణూ….తనకు అన్యాయం చేశాడని, సమాజం మాత్రం ఆదరించాలని కోరుకోవడం వెనుక ఉద్దేశం ఏంటని నెటిజన్లు నిలదీశారు. మీతో జీవితం పంచుకోడానికి పనికి రాని మనిషి, కోట్లాది మంది ప్రజానీకానికి మంచి చేస్తాడని ఎలా నమ్మాలంటూ ఆమెను నిలదీయడం గమనార్హం.
ఏ ప్రాతిపదిన పవన్‌కు రాజకీయంగా మద్దతు ఇస్తున్నారో చెప్పాలని ఆమెను నిలదీస్తున్నారు. మరోవైపు వ్యక్తిగతంగా తన విషయంలో రేణూ మరోసారి చెప్పారని, దీన్నే తాము ప్రచారం చేస్తున్నామని వైసీపీ నేతలు అంటున్నారు. పవన్‌కు సానుకూలంగా రేణు మాట్లాడిన అంశాల కంటే, తన విషయంలో తప్పు చేశారనే అభిప్రాయం ఎక్కువ నష్టం చేస్తోందనే ఆవేదన జనసేనలో కనిపిస్తోంది. మంచిగా మాట్లాడినట్టు కనిపించినా, ఇరికించారనే కోపం జనసేన నుంచి వ్యక్తమవుతోంది.