రిపోర్టులు బాబూ..రిపోర్టులు

ఎన్నడూ లేనంత క్యూరియాసిటీ కనిపిస్తోంది టాలీవుడ్ లో. మాంచి మాస్ ఫాలోయింగ్ వున్న ఇద్దరు హీరోల సినిమాలు ఈ సంక్రాంతికి వస్తున్నాయి. రెండు సినిమాలు సెన్సారు అయ్యాయి. రెండు సినిమాల డేట్ లు కాస్త…

ఎన్నడూ లేనంత క్యూరియాసిటీ కనిపిస్తోంది టాలీవుడ్ లో. మాంచి మాస్ ఫాలోయింగ్ వున్న ఇద్దరు హీరోల సినిమాలు ఈ సంక్రాంతికి వస్తున్నాయి. రెండు సినిమాలు సెన్సారు అయ్యాయి. రెండు సినిమాల డేట్ లు కాస్త అటు ఇటుగా పక్క పక్కన లేదా ఒకే రోజు అన్నది డిసైడ్ అవుతుంది.

ఈ లోగా ఇండస్ట్రీ మొత్తం మీద ఈ రెండు సినిమాల ఫీవర్ అలుముకున్నట్లు కనిపిస్తోంది. ఇండస్ట్రీ జనాలు ఏ ఇద్దరు పలకరించుకున్నా, ఏ ఇధ్దరు మాట్లాడుకున్నా సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో సినిమాల రిపోర్టుల గురించే. ఎలా వుంది? ఫస్ట్ హాఫ్ ఎలా వుంది? సెకండాఫ్ ఎలా వుంది? ఎంటర్ టైన్ మెంట్ ఎలా వుంది? ఎమోషన్ ఎలా వుంది? ఇదే డిస్కషన్.

అల వైకుంఠపురం సినిమాకు మాస్ హీరో. క్లాస్ డైరక్టర్. త్రివిక్రమ్ కు మాంచి ఓవర్ సీస్ మార్కెట్. బన్నీకి డొమస్టిక్ మార్కెట్. సరిలేరు నీకెవ్వరు సినిమాకు మాస్ డైరక్టర్. క్లాస్ హీరో. మహేష్ కు ఓవర్ సీస్ మార్కెట్ సూపర్. అనిల్ రావిపూడికి మాస్ మార్కెట్ సూపర్.

అల వైకుంఠపురములో చిన్న హీరోలు సుశాంత్-నవదీప్. సరిలేరులో సత్యదేవ్. అల సినిమాలో టబు, సరిలేరులో విజయశాంతి, సంగీత. సరిలేరులో చాలా కాలం తరువాత మహేష్ డ్యాన్స్ లు చేసారు. అల సినిమాలో బన్నీ సంగతి చెప్పనక్కర లేదు.

సరిలేరు సినిమాలో కథ మరీ కొత్తది కాదు, రెగ్యులర్ అనే వినిపిస్తోంది.అల వైకుంఠపురములో కూడా డిటో డిటో. 

రెండు సినిమాలు కూడా దాదాపు వంద కోట్లకు పైగా వ్యయంతో తయారైనవే. 130 నుంచి 150 కోట్ల మేరకు మార్కెట్ చేసినవే. ఒక్క పాటల విషయంలో మాత్రం అల వైకుంఠపురములో పై చేయి సాధించింది ఇప్పటికి. రెండు సినిమాలకు ఎక్స్ లెంట్ పీఆర్ వర్క్ జరిగింది. అటు సోషల్ మీడియాలో, ఇటు ఆన్ లైన్ మీడియాలో వార్తలు హోరెత్తాయి. యు ట్యూబ్ లో కంటెంట్ ఓ రేంజ్ లో హల్ చల్ చేసింది.

రెండు సినిమాల నిర్మాతలకు జనవరి 10 బ్యాడ్ సెంటిమెంట్ డేట్. అందుకే 11 డేట్ కోసం కిందా మీదా అవుతున్నారు. ఇలా ఇన్ని పోలికలతో విడుదలవుతున్న ఈ రెండు సినిమాల భవిష్యత్ మరో పది రోజుల్లో తేలిపోతుంది.