Advertisement

Advertisement


Home > Movies - Movie News

రిపబ్లిక్..ఇంటలెక్చ్యువల్ ట్రయిలర్

రిపబ్లిక్..ఇంటలెక్చ్యువల్ ట్రయిలర్

పొలిటికల్ సినిమాలు అంటే కేవలం అరుపులు కేకలతో వుంటాయన్నదే ఎక్కువగా తెలుగు సినిమాకు పరిచయం. పైగా ఏదో ఒక పార్టీ విధానాలను పేరు పెట్టకుండా అయినా గట్టిగా అరిచి విమర్శించడం మన తెలుగు సినిమాకు పరిపాటి. కానీ ఫర్ ఏ ఛేంజ్, అలా చేయకుండా, సమస్య మూలాల్లోకి వెళ్లి డీల్ చేయడం, ఎక్కడ నేరుగా మందు వేస్తే వ్యాధి పరిష్కారం అవుతుందన్నది చర్చించడం వంటి వాటితో కూడిన 'రిపబ్లిక్' సినిమాను అందిస్తున్నారు దర్శకుడు దేవా కట్టా.

రాజకీయ, అధికారిక, న్యాయ వ్యవస్థలకు మీడియా అనే నాలుగో వ్యవస్థ తోడుగా ప్రజాస్వామ్యం పరిఢవిల్లాల్సి వుంది. కానీ రాజకీయం అనే వ్యవస్థ మిగిలిన అన్ని వ్యవస్థలను కబళించి, తన కబంధ హస్తాల్లో పెట్టేసుకుంటే ఇక ప్రజాస్వామ్యం అన్నది ఎక్కడ వుంటుంది. అధికారిక వ్యవస్థకు ప్రతినిధి అయిన కలెక్టర్ (సాయిధరమ్), రాజకీయ వ్యవస్థ (రమ్యకృష్ణ) ను ఢీకొని ప్రజా సమస్యల మీద తనకున్న పరిథిలో ఎలా పోరాడాడు అన్నది రిపబ్లిక్ సినిమాగా ట్రయిలర్ చూస్తే అర్థం అవుతోంది. 

అయితే దేవా కట్టా సుగుర్ కోట్ కు దూరంగానే వున్నట్లు అర్థం అవుతోంది. సినిమా అన్నది పామర జన రంజకం అయినా కూడా, ఎన్నాళ్లిలా? వాళ్లకీ తెలియాలి కదా? అనే ఆలోచనతో కావచ్చు. కాస్త ఇంటలెక్చ్యువల్ గానే వెళ్లినట్లు కనిపిస్తోంది. రాజకీయ, అధికారిక, న్యాయ వ్యవస్థలను చాలా పద్దతిగా లెజిల్లేచర్, జ్యుడిషియరీ, లాంటి పదాలు వాడడం అంటే అదే అనుకోవాలి. 

మదమెక్కిన ఏనుగును మావటీ అంకుశంతో లొంగదీసుకోవాల్సిందే అంటే కొంత అయినా అర్థం అవుతుంది. అదుపుతప్పిన రాజకీయ వ్యవస్థను జ్యూడిషియరీ నియంత్రించకపోతే, హిట్లర్ పుడతాడు అంటే అర్థం చేసుకోవడానికి టైమ్ పడుతుంది. కానీ నిజాయతీగా తన స్టయిల్ లోనే సినిమా అందించాలని దేవా కట్టా డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. 

సాయి ధరమ్ తేజ, రమ్యకృష్ణ ల నడుమ సాగే సీరియస్ కథనం ఎలా సాగిందో ట్రయిలర్ జస్ట్ శాంపిల్ చూపించింది. హెవీ సీరియస్ టేకింగ్ తో కూడిన ఈ సినిమా అక్టోబర్ 1న థియేటర్లలోకి వస్తోంది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?