నిన్నట్నుంచి ఆర్జీవీ డెన్ పై ఓ రేంజ్ లో చర్చ నడుస్తోంది. అందమైన హీరోయిన్ల ఫొటోలు, బికినీ స్టిల్స్ తో పాటు ఆలోచింపజేసే కొటేషన్లు, కవ్వించే ఇంటీరియర్ తో తన కొత్త ఆఫీస్ ను పరిచయం చేశాడు వర్మ. ఆ వీడియో వైరల్ అవ్వడంతో పాటు.. అందులో ఉన్న కొన్ని కొటేషన్లు, థీమ్స్ కు అర్థం ఏంటో తెలుసుకోవాలనే ఉత్సుకతను చాలామంది వెలుబుచ్చారు.
దీంతో వెంటనే ఆర్జీవీ నుంచి మరో వీడియో వచ్చేసింది. తన డెన్ (కొత్త ఆఫీస్ పేరు) లో ఉండే కొటేషన్లు, థీమ్స్ కు అర్థాల్ని వివరిస్తూ, కొద్దిసేపటి కిందట మరో వీడియో విడుదల చేశాడు ఆర్జీవీ. ఆ వీడియోలో ఓ వ్యక్తి వాయిస్ ఓవర్ చెబుతున్నాడు. గొంతు వేరే వ్యక్తిది అయినప్పటికీ.. అందులో భావం మొత్తం ఆర్జీవీదే.
ఆర్జీవీ ఎలాంటి వ్యక్తి, అతడి వ్యక్తిత్వం ఏంటి, అతడి ఆలోచన విధానం ఎలా ఉంటుందో.. ఈ ఆర్జీవీ డెన్ లో ప్రతి అంశం అలానే ఉంది. ఇంకా చెప్పాలంటే కొత్త ఆఫీస్ లో ప్రతి కార్నర్ లో ఆర్జీవీ మార్క్ కనిపిస్తుంది, అతడి భావజాలం వినిపిస్తుంది.
డార్క్ కలర్ థీమ్ తో, బికినీ ఫొటోలతో ఆఫీస్ ను అందంగా తీర్చిదిద్దిన ఆర్జీవీ.. అలాంటి ఆఫీస్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందో.. వివరణ ఇప్పించుకున్నాడు. దీనికి దీనికి బోల్డ్ ఎనాలిసిస్ అనే పేరు పెట్టాడు.
ఇదే ఆఫీస్ లో చిన్న స్టుడియోస్ సెటప్ కూడా పెట్టాడు ఆర్జీవీ. ఈమధ్య ఆయన 'నిజం' పేరిట యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నాడు. వాటి షూటింగ్స్, ఎడిటింగ్స్, మిక్సింగ్స్ అన్నీ డెన్ లోనే జరిగేలా ఏర్పాట్లు చేసుకున్నాడు. అంతేకాదు, తన స్టయిల్ లో, ఓ చిన్న సినిమాను కూడా అక్కడే చుట్టేసేలా డెన్ ను డిజైన్ చేయించుకున్నాడు వర్మ.