చేసింది చెత్త పని. దానిపై ట్రోల్స్ కూడా ఎదుర్కొంటున్నాడు. అయినప్పటికీ తన పనిని తాను సమర్థించుకుంటున్నాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. తనపై జరుగుతున్న ఎదురుదాడికి, విమర్శలకు తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు. ఓ చిట్ చాట్ షోలో, అషు రెడ్డి కాలి బొటన వేలు చీకడం కరెక్ట్ అని చెప్పే ప్రయత్నం చేశాడు ఆర్జీవీ.
“నేను, అషు రెడ్డి అడల్ట్స్. పూర్తి అంగీకారంతో, ఇద్దరు అడల్ట్స్ చేసిన పని అది. మేం మాట్లాడుకున్న మాటలు, మేం చేసిన పనులు పూర్తిగా మా అవగాహనతోనే జరిగాయి. అది మా ఇద్దరి మధ్య వ్యవహారం. మిగతా వాళ్లు అది చూడొచ్చు, చూడకపోవచ్చు. వినోదం కోసం ఒక్కొక్కరు ఒక్కో పని చేస్తారు. కొందరు సినిమాలు చూస్తారు, కొందరు పబ్ కు వెళ్తారు. నేను ఎంచుకున్నదేంటంటే.. ఓ అందమైన అమ్మాయితో ఈ రకమైన ముచ్చట్లు పెట్టుకోవడం. మీకు నచ్చనవి వందలు, వేలల్లో జరుగుతుంటాయి. అన్నింటినీ మీరు ఆపలేరు కదా. ఇది కూడా అలాంటిదే అనుకోండి.”
ఇలా అషురెడ్డి కాలిపై ముద్దుపెట్టుకోవడం, వేలు చీకడం లాంటి పనుల్ని పూర్తిస్థాయిలో సమర్థించుకున్నాడు వర్మ. తనకు ఏం అనిపిస్తే అది చేస్తానని, అది తన హక్కు అంటూ రాజ్యాంగం గురించి చెప్పిన వర్మ.. తను పెట్టిన వీడియోస్ నచ్చకపోతే, ఒక్క క్షణంలో తన ఎకౌంట్ నుంచి అన్-సబ్ స్క్రైబ్ అవ్వొచ్చని, ఫాలోవర్స్ కోసం పాకులాడే రకం తను కాదని స్పష్టం చేశాడు.
డేంజరస్ ఇంటర్వ్యూ అంటూ 4 రోజుల కిందట అషురెడ్డిని పెట్టి ఓ ముచ్చట్ల ప్రొగ్రామ్ పెట్టాడు వర్మ. పొట్టి డ్రెస్ వేసుకున్న అషురెడ్డిని కుర్చీలో కూర్చోబెట్టి, ఆమె కాళ్ల దగ్గర తను కూర్చొని వేదాంతం మొత్తం ఒలకబోశాడు. మధ్యమధ్యలో అషురెడ్డి కాళ్లతో ఏం చేయాలో అంతా చేశాడు. ఇంత యాగీ చేసిన వర్మ తను పర్వర్ట్ కాదంటున్నాడు.