మామూలుగానే ఆర్జీవీని ఆపడం ఎవరితరం కాదు. అలాంటిది 31 రాత్రి వర్మను కంట్రోల్ చేయడం చాలా కష్టం. అలా కంట్రోల్ చేయలేని విధంగా రెచ్చిపోయాడు వర్మ. ఓ వైపు మందు కొడుతూనే, మరోవైపు ట్వీట్స్ తో కూడా కొట్టాడు. ప్రతి ఏడాదిలానే కొత్త సంవత్సరం కూడా ఉంటుందని, అది తెలియని కొంతమంది అమాయకులు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటారంటూ స్టార్ట్ చేసిన వర్మ.. వరుసగా ట్వీట్స్ పెడుతూనే ఉన్నాడు.
ఈసారి 31 రాత్రిని తన డెన్ లోనే సెలబ్రేట్ చేసుకున్నాడు వర్మ. అతడి సినిమాలకు ఎక్కువగా వర్క్ చేసే కాస్ట్యూమ్ డిజైనర్ శ్రియబెనర్జీ రాత్రి వర్మతో పాటు ఫ్రెండ్స్ కు కంపెనీ ఇచ్చింది. “న్యూ ఇయర్ ను సెలబ్రేట్ చేసుకుంటున్నాను. దీనికి కారణం అమ్మాయిల కాళ్లు, దావుద్ ఇబ్రహీం, డొనాల్డ్ ట్రంప్ మాత్రమే” అంటూ ట్వీట్ చేశాడు వర్మ. ఈ సందర్భంగా అమ్మాయి డాన్స్ చేస్తుంటే.. కింద నుంచి తను కాళ్లు చూసే వీడియోను పోస్ట్ చేశాడు.
న్యూ ఇయర్ సందర్భంగా యూత్ కు తనదైన స్టయిల్ లో సందేశం కూడా ఇచ్చాడు ఆర్జీవీ. కొత్త ఏడాదిలో అంతా ఎక్కువగా తాగాలని, మరీ ముఖ్యంగా యువత ఎక్కువగా తాగాలని సందేశమిచ్చాడు. అయితే నీళ్లు ఎక్కువ తాగాలనేది తన ఉద్దేశమంటూ మరో ట్వీట్ వేశాడు. ప్రతి ఏడాదిలో ఆఖరి రోజు టెర్రఫిక్ గా ఉంటుందంటున్నాడు వర్మ. ఎందుకంటే ఫుల్ గా పార్టీ చేసుకుంటాం కాబట్టి టెర్రిఫిక్ గా ఉంటుందని… అయితే తలనొప్పి, హ్యాంగోవర్ కారణంగా ప్రతి ఏడాది మొదటి రోజు కూడా టెర్రిఫిక్ గా ఉంటుందని ట్వీట్ చేశాడు.
ఇలా రాత్రంతా వర్మ ట్వీట్ల గోల కొనసాగుతూనే ఉంది. ఇక ఆఖరి ట్వీట్ గా కేసీఆర్ ను కూడా టార్గెట్ చేశాడు వర్మ. ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఏ సమయంలోనైనా డ్రింక్ చేయొచ్చని, కానీ ప్రజలు మాత్రం న్యూ ఇయర్ టైమ్ లో కూడా అన్ని వేళల్లో డ్రింక్ చేయకుండా అడ్డుకోవడం భావ్యం కాదని విమర్శించాడు.