Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఆర్జీవీ..మళ్లీ అదే దిక్కుమాలిన ట్రిక్కు

ఆర్జీవీ..మళ్లీ అదే దిక్కుమాలిన ట్రిక్కు

మామూలుగా సినిమా తీయడం మరిచిపోయారు. జనం కూడా వర్మ సినిమాలను లైట్ తీసుకోవడం అలవాటు చేసుకున్నారు. ఓటిటి, ఏటిటి, థియేటర్ ఇలా ఎక్కడ విడుదలైనా సరే సినిమాను తిప్పి అవతల విసురుతున్నారు. 

అసలు సినిమా వచ్చేవరకే హఢావుడి. ఇక వచ్చిన తరువాత అసలు అజ, పజ వుండదు. మర్డర్ కావచ్చు, మరోటి కావచ్చు. ఏ సినిమా అయినా ఫలితం ఒకటే. ఫలితంతో నాకు అనవసరం, నాకు డబ్బులు వస్తున్నాయి అంటూ తామరతంపరగా సినిమాలు తీస్తూనే వున్నారు. 

గతంలో సోషల్ మీడియాలో అయినా కాస్త పట్టించుకునేవారు, ఇప్పుడు అక్కడ కూడా జనం స్పందించడం మానేసారు. అయినా సినిమాలో విషయం కన్నా, విడుదలైన తరువాత హడావుడి కన్నా, మేకింగ్ టైమ్ లో ఏదో సంచలనం కోసం పాకులాడడమే వర్మ స్టయిల్ గా మారిపోయింది.

ఇప్పుడు మళ్లీ అదే పనికి తెరతీసారు. ఇది..మహాభారతం..కాదు అంటూ టైటిల్ పెట్టి, ధర్మన్న, ధుర్యోన, ద్రుపద అంటూ తనకు అలవాటైన పేరడీ టైటిళ్లు పెట్టి సినిమా అనౌన్స్ చేసారు. 

మళ్లీ ఎప్పటిలాగే తన అద్భుతమైన స్వరంతో జనాలను రెచ్చగొట్టేస్తున్నా అనే ఫీలింగ్ తో ఇది మహాభారతం కాదు, ఈ సినిమా మీద టీవీ డిస్కషన్లు పెట్టొద్దు పండితులారా అంటూ పిలుపు ఇచ్చారు.

నిజానికి వర్మకు కావాల్సింది ఈ డిస్కషన్లే. వర్మ ఏదో చేసేస్తున్నాడన్నంత హడావుడి జరగాలి. టీవీల్లో నానాలి. తీరా చేసి సినిమా విడుదలయితే 'ఏనుగు సామెత' మాదిరిగా ఇట్టే గాల్లో కలిసిపోవాలి. 

దీని కోసం ఆయనకు సాయం పట్టే టీవీ చానెళ్లు, యాంకర్లు ఒకటి రెండు వుండనే వున్నాయి.కానీ జనం ఇదంతా పట్టేసుకున్నారు. అందుకే రాను రాను వర్మ సినిమా ప్రకటనలకు కూడా రెస్పాన్స్ రావడం మానేసింది. ఇక మిగిలింది ఆయన సినిమాలు ప్రకటించడం మానేయడమే.

బాబు బతికున్నంత వరకు ఎన్టీఆర్ కి భారత రత్న రాదు

చంద్ర‌బాబు పై జేసీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?