అలాంటి వాళ్లను నా చేతులతో చంపాలనుంది

అఘాయిత్యాలకు పాల్పడే వాళ్లపై ఎవ్వరూ జాలి చూపించరు. వాళ్లను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తారు. హీరోయిన్ రితికా సింగ్ ఈ విషయంలో ఇంకాస్త సూటిగా, నిజాయితీగా స్పందించింది. అలాంటి వాళ్లను తన చేతులతో చంపాలనుకుంటానని…

అఘాయిత్యాలకు పాల్పడే వాళ్లపై ఎవ్వరూ జాలి చూపించరు. వాళ్లను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తారు. హీరోయిన్ రితికా సింగ్ ఈ విషయంలో ఇంకాస్త సూటిగా, నిజాయితీగా స్పందించింది. అలాంటి వాళ్లను తన చేతులతో చంపాలనుకుంటానని తెలిపింది.

“నేను సోషల్ మీడియా ఓపెన్ చేసిన ప్రతిసారి, రోజుకు కనీసం 5 ఆర్టికల్స్ అఘాయిత్యాలపై కనిపిస్తాయి. 8 నెలలు, 3 నెలల చిన్నారులపై అత్యాచారాలు జరిగినట్టు చూస్తుంటే కోపం వస్తుంది. మరీ ఇంత దారుణంగా మనుషులు ఎలా ఉంటారనిపిస్తుంది. అలాంటి వాళ్లను నా చేతులతో శిక్షించాలనుకుంటాను. బాధిత మహిళలు/బాలికలకు ఎలా జరిగిందో, వాళ్లకు కూడా అదే జరగాలని కోరుకుంటాను. అమ్మాయిల్ని ఆటబొమ్మలుగా చూసే మనుషులకు ఎంత పెద్ద శిక్ష వేసినా తక్కువే.”

ఇన్-కార్ అనే సినిమా చేసింది రితికా సింగ్. మహిళలపై జరుగుతున్న అకృత్యాల నేపథ్యంలో ఈ సినిమాను తీశారు. ఈ సినిమా చేస్తున్నంతసేపు తనకు ఎప్పుడూ అఘాయిత్యాలకు సంబంధించిన వార్తాకథనాలే గుర్తొచ్చేవని చెప్పుకొచ్చింది రితికా సింగ్.

ఈ సినిమా ప్రచారంలో భాగంగా చెన్నైలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ మీడియా సమావేశానికి ఏకంగా 3 గంటలు ఆలస్యంగా వచ్చింది రితికా. దీంతో ఆమెపై మీడియా ప్రతినిధులు భగ్గుమన్నారు. ఈ ఘటనపై రితికా సింగ్ క్షమాపణలు చెప్పింది. ప్రెస్ మీట్ రాత్రి 9 గంటలకని తనకు చెప్పారని, అందుకే తను 9 గంటలకు వచ్చానని, నిజంగా 6 గంటలకు ప్రెస్ మీట్ అనే విషయం తనకు తెలియదని చెప్పుకొచ్చింది.