cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie News

'రౌడీ బేబీ' ట్రబుల్ ఇస్తోంది

'రౌడీ బేబీ' ట్రబుల్ ఇస్తోంది

రౌడీ బేబీ..ఈ పదం భలే పాపులర్ అయిపోయింది. అందుకే ఈ టైటిల్ లో సినిమా ప్లాన్ చేసారు నిర్మాత ఎంవివి సత్యనారాయణ, రైటర్ కోన వెంకట్. సినిమా షూట్ మాగ్జిమమ్ విశాఖలో పూర్తి చేసారు. కానీ ఇప్పుడు అనుకోని సమస్య వచ్చి పడింది.

టైటిల్ రిజిస్టర్ చేయకుండానే సెట్ మీదకు వెళ్లిపోయినట్లున్నారు. తీరా చూస్తే టైటిల్ అవైలబుల్ లేదని తెలుస్తోంది. తమిళంలో హిట్ అయిన ఓ సినిమాను నిర్మాత హరి కోని తెలుగులోకి డబ్ చేసారు.

ఇదంతా కరోనాకు ముందే జరిగిపోయింది. దానికి టైటిల్ రౌడీ బేబీ అనుకుని ఫిక్స్ అయ్యారు. ఆ మేరకే అన్నీ రిజిస్టర్ చేసుకున్నారు. సెన్సారు కూడా రౌడీ బేబీ టైటిల్ తోనే అయిపోయింది. విడుదల అన్నది దిల్ రాజు టైమ్ స్లాట్ చెప్పడం కోసం పెండింగ్ లో వుంది.

ఇలాంటి నేపథ్యంలో ఆ టైటిల్ ఇచ్చేయమని కోన వెంకట్ కోరుతున్నట్లు తెలుస్తోంది. సమస్య లేదని, సెన్సారు కూడా అయిపోయిందని, ఈ నెలలోనో, వచ్చే నెలలోనో స్లాట్ చూసుకుని విడుదల చేస్తామని రౌడీ  బేబీ నిర్మాత హరి అంటున్నారు. టైటిల్ చేతులు మారుతుందో, కొత్త టైటిల్ వస్తుందో చూడాలి. 

దేశం మౌనం పాటిస్తోంది

ఆ పేరు కూడా పలకను

 


×