రౌడీ టీజర్ గాలి తీసేసారు

ఇది డిజిటల్ యుగం. ఏదైనా వర్క్ రిలీజ్ అయితే చాలు, జనం మొత్తం జల్లెడ పట్టేస్తారు. ఎక్కడెక్కడి రిఫరెన్స్ లో తెచ్చేస్తారు. ఇప్పుడు అదే జరిగింది. రౌడీ బాయిస్ టీజర్ ఇలా విడుదల కాగానే…

ఇది డిజిటల్ యుగం. ఏదైనా వర్క్ రిలీజ్ అయితే చాలు, జనం మొత్తం జల్లెడ పట్టేస్తారు. ఎక్కడెక్కడి రిఫరెన్స్ లో తెచ్చేస్తారు. ఇప్పుడు అదే జరిగింది. రౌడీ బాయిస్ టీజర్ ఇలా విడుదల కాగానే అందులోని ఒకే ఒక పంచ్ డైలాగ్ ను ఎక్కడి నుంచి కాపీ కొట్టేసారో, సీన్ ఎక్కడ నుంచి లేపేసారో జనం పట్టేసి, సోషల్ మీడియాలో పెట్టేసారు. 

దిల్ రాజు సోదరుడు శిరీష్ కుమారుడు ఆశిష్ రెడ్డి హీరోగా పరిచయం అవుతున్నారు. రౌడీ బాయిస్ అనే టైటిల్ లో ఓ కాలేజీ బ్యాక్ డ్రాప్ యూత్ ఫుల్ స్టోరీని తెరెక్కిస్తున్నారు. ఈ సినిమా టీజర్ ను ఈ రోజు విడుదల చేసారు. ఆ టీజర్ లో కీలకమైన పంచ్ డైలాగు వుంది. పైగా హీరో కూడా తన ప్రసంగంలో సినిమా మొత్తం మీద అదే డైలాగు తనకు చాలా ఇష్టం అని చెప్పాడు.

అంతలోనే మెగాస్టార్ హిట్లర్ సినిమాలోని అదే డైలాగ్ బిట్ ను కట్ చేసి సోషల్ మీడియాలోకి తెచ్చేసారు నెటిజన్లు. హిట్లర్ సినిమాలో ఉత్తేజ్, చిట్టిబాబుల మీద అదే డైలాగు పేల్చారు. ఇప్పుడు అదే డైలాగును హీరో అండ్ కో తో చెప్పించారు.

సినిమా టీజర్ లెవెల్ లోనే దర్శకుడు కాపీ వైఖరిని బయటకు లాగేసారు సోషల్ మీడియా జనాలు.