మరో ఘనత అందుకున్న ఆర్ఆర్ఆర్

గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ అందుకొని ఇప్పటికే సంచలనం సృష్టించిన ఆర్ఆర్ఆర్ సినిమా, ఇప్పుడు మరో ఘనత సాధించింది. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ (HCA) అవార్డుల్లో ఏకంగా 4 అవార్డుల్ని సొంతం చేసుకుంది ఈ సినిమా.…

గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ అందుకొని ఇప్పటికే సంచలనం సృష్టించిన ఆర్ఆర్ఆర్ సినిమా, ఇప్పుడు మరో ఘనత సాధించింది. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ (HCA) అవార్డుల్లో ఏకంగా 4 అవార్డుల్ని సొంతం చేసుకుంది ఈ సినిమా. ఈ క్రమంలో హాలీవుడ్ బ్లాక్ బస్టర్స్ బ్లాక్ పాంథర్, ది ఉమెన్ కింగ్, ది బ్యాట్ మ్యాన్ సినిమాల్ని సైతం ఆర్ఆర్ఆర్ వెనక్కి నెట్టడం విశేషం.

ఉత్తమ అంతర్జాతీయ చిత్రం, ఉత్తమ యాక్షన్ చిత్రం, ఉత్తమ స్టంట్స్, ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగాల్లో ఆర్ఆర్ఆర్ సినిమా అవార్డులు అందుకుంది. ఈ అవార్డుల్లో టామ్ క్రూజ్ నటించిన 'టాప్ గన్: మావెరిక్' చిత్రాన్ని సైతం బీట్ చేసింది.

అవార్డుల స్వీకరణలో భాగంగా హీరో రామ్ చరణ్ తో కలిసి వేదికను పంచుకున్నాడు దర్శకుడు రాజమౌళి. తన సినిమాకు ఇన్ని అవార్డులు వస్తాయని ఊహించలేదన్న రాజమౌళి, జ్యూరీకి కృతజ్ఞతలు తెలిపాడు. వీలైతే, బెస్ట్ స్టంట్ మాస్టర్స్ విభాగాన్ని కూడా ప్రవేశపెట్టాలని హెచ్ సీ ఏను కోరాడు.

తాజా అవార్డులతో ఆర్ఆర్ఆర్ సినిమా అస్కార్ రేసులో మరింత ముందుకు దూసుకెళ్లింది. మార్చి 12న లాస్ ఏంజెలిస్ లోని డాల్బీ థియేటర్ లో జరగనున్న అకాడమీ అవార్స్ లో ఆర్ఆర్ఆర్ కు కచ్చితంగా ఆస్కార్ వస్తుందనే అంచనాలు పెరిగాయి. మరీ ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయిలో అందర్నీ ఆకట్టుకుంటున్న నాటు-నాటు సాంగ్ కు కచ్చితంగా అకాడమీ అవార్డు వస్తుందనే అంచనాలు బలంగా ఉన్నాయి.