Advertisement

Advertisement


Home > Politics - Analysis

ఎవరి పార్టీ లోకేష్ అంటున్న ఫ్యాన్స్

ఎవరి పార్టీ లోకేష్ అంటున్న ఫ్యాన్స్

పార్టీలోకి ఎవరైనా రావచ్చు. అందరికీ వెలకమ్..పవన్ కళ్యాణ్..ఎన్టీఆర్ అంటూ చాలా తెలివైన సమాధానం ఇచ్చి మురిసిపోయారు నారా లోకేష్. అబ్బ మా లోకేష్ బాబు ఎంత ముచ్చటైన సమాధానం ఇచ్చారో అని తెలుగుదేశం అను’కుల’మీడియా తెగ టముకేసింది. 

అయినా ఎన్టీఆర్ గురించి అడిగితే పవన్ కళ్యాణ్ ను కలిసాను. ఆయనకు చాలా మంచి ఆలోచనలు వున్నాయి. ఆయనే కాదు. చదువుకున్నవారు, పారిశ్రామికవేత్తలు, ఎన్టీఆర్ ఇలా అందరూ రావాలి అని చెప్పడం అంటే అతి తెలివి కాక మరేంటీ?

అందుకే ఎన్టీఆర్ ఫ్యాన్స్ భగ్గుమన్నారు. ఎన్టీఆర్ పెట్టిన పార్టీ ఇది. అందులో కూతురు కొడుకుగా లోకేష్ కు ఎంత హక్కు వుందో, కొడుకు కొడుకుగా ఎన్టీఆర్ కు అంతకు మించి హక్కు వుంటుంది. 

నిజానికి లోకేష్ తో సమానంగా ఎన్టీఆర్ పాదయాత్ర చేసే లోకేష్ తట్టుకోగలరా? ఎన్టీఆర్ కు వున్న చరిష్మాలో పదో వంతు అయినా లోకేష్ కు వుందా? అయితే ఎన్టీఆర్ గురించి మాట్లాడకుండా పవన్ ను పొగడ్డం ఏమిటి? అంటే పార్టీకి ఎన్టీఆర్, పవన్, ఇలా ఎవరైనా ఒకటే అని చెప్పడమా? 

అందుకే ఫ్యాన్స్ ఓ లెక్కలో కామెంట్లు పెడుతున్నారు సోషల్ మీడియాలో. లోకేష్ అనుమతి కావాలా? ఎన్టీఆర్ కు పార్టీలోకి రావాలంటే అంటున్నారు. ఇలాంటి కొంకి మాటలు విన్న తరువాత ఎన్టీఆర్ ఎన్నికల ప్రచారానికి వస్తాడా? పైగా పవన్ ను ముద్దు చేసి నెత్తిన పెట్టుకుంటూ వుంటే ఎన్టీఆర్ ఎందుకు వస్తాడు? అంటే పిలిచినట్లూ తన అను’కుల’ మీడియాలో ప్రచారం సాగాలి. అలా అని ఎన్టీఆర్ రాకూడదు. అతగాడిని పార్టీ జనాలు తిట్టుకోవాలి. ఇదే కావచ్చు లోకేష్ స్ట్రాటజీ.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?