ఆర్ఆర్ఆర్. బయ్యర్ల భయం..భయం

''మీకు ఏమైనా టాక్ తెలిసిందా..దిల్ రాజు చూసారట కదా… సినిమా సూపర్ అని చెబుతున్నారట కదా? నిజమే అంటారా?  లేదా కావాలని ఇలాంటి గ్యాసిప్ లు పుట్టిస్తున్నారా?..మీకే మైనా ఐడియా వుందా?'' Advertisement ఇది…

''మీకు ఏమైనా టాక్ తెలిసిందా..దిల్ రాజు చూసారట కదా… సినిమా సూపర్ అని చెబుతున్నారట కదా? నిజమే అంటారా?  లేదా కావాలని ఇలాంటి గ్యాసిప్ లు పుట్టిస్తున్నారా?..మీకే మైనా ఐడియా వుందా?''

ఇది ఆర్ఆర్ఆర్ కొనుగోలు చేసిన ఓ డిస్ట్రిబ్యూటర్ ఫోన్ చేసిన అడిగిన ప్రశ్నలు. ఆ బయ్యర్ మాత్రమే కాదు. ఆర్ఆర్ఆర్ కొనుగోలు చేసిన వాళ్లంతా విపరీతమైన టెన్షన్ పడిపోతున్నారు. సినిమాను పెద్ద మొత్తాలకు కమిట్ అయిపోయారు. ఇన్నేళ్ల కాలంలో అడ్వాన్స్ లకు భారీగా వడ్డీలు కట్టేసారు. ఇప్పుడు మిగిలిన బ్యాలన్స్ మొత్తాలు కట్టే టైమ్ వచ్చింది. 

ఎంత బేరసారాలు ఆడినా వన్ పర్సంట్ కూడా తగ్గించేది లేదని నిర్మాత దానయ్య భీష్మించుకు కూర్చున్నారు. ఇది మాత్రమే సమస్య కాదు. కిందన ఎగ్జిబిటర్లు కూడా పెద్దగా అడ్వాన్స్ ఇచ్చే పరిస్థితి లేదని మొండికేస్తున్నారు. మామూలుగా అయితే కట్టాల్సిన మొత్తాలు అన్నీ థియేటర్ల నుంచే వస్తాయి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. బయ్యర్లు తమ ఇళ్ల నుంచి తెచ్చి కట్టాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.

ఆంధ్రలోని ఓ పెద్ద జిల్లాలో పెద్ద మొత్తంలో థియేటర్లు వున్న ఎగ్జిబిటర్ తమ థియేటర్లలో సినిమా వేస్తే వేసుకోండి లేదంటే మానండి..అడ్వాన్స్ లు మాత్రం ఇచ్చేది లేదని స్పష్టం చేసేసారు. మహా అయితే ఓ యాభై లక్షలు ఇస్తా అన్నారు. మూడు కోట్లు వస్తాయి అనుకుంటే యాభై లక్షలు అనే సరికి అక్కడ బయ్యర్ కిందా మీదా అవుతున్నారు.

భీమ్లా నాయక్ ఆశించన మేరకు ఆడలేదు. రాధేశ్యామ్ పరాజయం పాలైంది. దీంతో ఎగ్జిబిటర్లు డబ్బులు తీసే పరిస్థితి కనిపించడం లేదు. ఇలాంటి నేపథ్యంలో మొత్తం డబ్బులు జేబులోంచి తీసి కట్టేయవచ్చా? సినిమా ఎలా వుంటుంది? ఎంత రావచ్చు? ఇలాంటి ప్రశ్నలు అన్నీ బయ్యర్లను వెంటాడుతున్నాయి. అందుకే ఫోన్ లు చేసి ఇలా ఎంక్వయిరీలు చేస్తున్నారు. పైగా దిల్ రాజు చూసారు. ముంబాయిలో షో వేసారు ఇలాంటి వార్తలు అన్నింటినీ అనుమానంగా చూస్తున్నారు. కావాలని పుట్టిస్తున్నారా? నిజమేనా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

రాజమౌళి తలుచుకుంటే ఏమైనా డిస్కౌంట్ వస్తుందా? ఆ వైపు ప్రయత్నాలు చేస్తే ఎలా వుంటుంది అన్న డిస్కషన్ల కూడా బయ్యర్ల నడుమ సాగుతున్నాయి. మొత్తం మీద బయ్యర్లలో సినిమాను కొన్నప్పుడు వున్న ఆనందాన్ని విడుదల టైమ్ లో టెన్షన్ దూరం చేస్తోంది.