టాలీవుడ్ ఎదురుచూస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్ విడుదల మీద క్లారిటీ రాబోతోంది. సినిమా డేట్ ను ఈ రోజు అధికారికంగా ప్రకటించబోతున్నారు.
ఈ సినిమా విడుదల మీద టాలీవుడ్ లో అనేక పెద్ద సినిమాల ప్లానింగ్, రిలీజ్ డేట్ లు ఆధారపడి వున్నాయి. అందుకే అంతా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
ఈ మధ్యాహ్నం అందరూ ఎదురుచూస్తున్న విషయం వెల్లడించబోతున్నట్లు ట్విట్టర్ లోకి వచ్చేసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ ఏడాది దసరాకు ఆర్ఆర్ఆర్ విడుదల అని డేట్ ప్రకటించబోతున్నారు.
ఆర్ఆర్ఆర్ షూట్ దాదాపు పూర్తయింది. తీసిన క్లయిమాక్స్ అవుట్ పుట్ ఎలా వచ్చింది అన్నది క్లారిటీ వచ్చేస్తే హీరోలు ఇద్దరూ వేరే సినిమాల మీదకు పూర్తిగా వెళ్లిపోతారు.
గత ఏడాది దసరాకు రావాల్సిన సినిమా ఈ ఏడాది సంక్రాంతికి వాయిదా పడింది. ఆ తరువాత కరోనా పుణ్యమా అని ఈ ఏడాది దసరాకు వెళ్లింది. అయితే రాజమౌళి శిల్పకళ తెలిసిన వారు ఈ ఏడాది దసరాకు కూడా వస్తుందా? అని అనుమానాలు వ్యక్తం చేస్తుండడం విశేషం.